దేశంలో వాహన చోదకులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించనుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది వాహనదారులకు భారీ ఊరట కల్పించేలా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నది. అదేంటంటే.. ప్రస్తుతం.. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే.. అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది. అంటే మీరు చిన్న వయసులోనే లైసెన్స్ పొందితే, 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎలాంటి రీన్యూవల్ టెన్షన్స్ లేకుండా నిశ్చింతగా వాహనాలను నడుపుకోవచ్చన్నమాట.
ఈ నయా ప్రతిపాదన వెనుక కేవలం గడువు పెంపు మాత్రమే కాదు.. రవాణా శాఖకు సంబంధించిన అనేక సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే బలమైన సంకల్పం కూడా ఉంది. ఇకపై వాహనాల యాజమాన్య బదిలీ ప్రక్రియతో పాటు వివిధ రకాల పర్మిట్ల పునరుద్ధరణ (Permit Renewal) పనులను వంద శాతం ఆన్‌లైన్ విధానంలోనే పూర్తి చేసేలా సరికొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-need-to-renew--driving-license-until-50years-age-36-222387.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.