విజయసాయికి పొగ పెట్టేశారా?.. రాజ్యసభ కూడా అనుమానమేనా?

Publish Date:Apr 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో,,ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డికి ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్నింటిలో విజయ సాయి, నెంబర్ 2గా ఉంటూనే ఉన్నారు.చివరకు అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి జైలుకు వెళితే,ఆయన వెంట విజయసాయి కూడా  జైలుకు వెళ్ళారు. మొత్తం 16 నెలలు ఆయనతో జైలులోనే ఉన్నారు. ఇక వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందు కూడా ఢిల్లీలో జగన్ రెడ్డి  పనులను విజయసాయి చక్క పెడుతూ వచ్చారు. అలాగే,రాజ్యసభ ఎంపీగా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రభుత్వ కార్యకలాపాలను, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కూడా ఆయనే నెత్తికెత్తుకున్నారు..మరో వంక ఉత్తరాంధ్ర వైసేపీ ఇంచార్జిగా, ఆమూడు జిల్లాలకు ఆయనే ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. 

అయితే రాజకీయాలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి అన్నట్లుగా, ఇప్పుడు సీన్ రివర్స్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకనో గానీ, విజయసాయి రెడ్డిని పదవుల నుంచి పక్కకు తప్పిస్తున్నారు. ఒకప్పుడు, ప్రస్తుతం సజ్జల నిర్వహిస్తున్న,‘ఆల్ ఇన్ వన్’  పోజిషన్’లో విజయసాయి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత, సజ్జల ఎంట్రీతో జగన్ రెడ్డి, సాయి రెడ్డి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు చివరకు విజయసాయి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు.

ఇటీవల జగన్ రెడ్డి చేపట్టిన పార్టీ పక్షాళన కార్యక్రమలో భాగంగా ఉత్తరాంధ్ర ఇంచార్జి (సమన్వయకర్త) బాధ్యతల నుంచి విజయ సాయి రెడ్డినితప్పించారు. వైవీ సుబ్బారెడ్డికి విశాఖ పార్టీ బాధ్య‌త‌లు అప్పగించారు. అంతే కాదు, విజయ సాయికి, ఇంకో కీలక బాధ్యత అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. ఆయన పదవులు ఒక టొకటిగా, తీసేస్తున్నారు. ఒక విధంగా చూస్తే, జగన్ రెడ్డి ఎందుకనోగానీ,ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ నెచ్చలి శశికళను దూరం పెట్టినట్లుగా జగన రెడ్డి   విజయ సాయిని   దూరం పెడుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొమ్మన కుండా పోగాబెడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విజయసాయి పరిస్థితి ఇంత బతుకూ బతికి.. అన్నట్లుగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్’ పోస్టుకే పరిమితం అయిందని, పార్టీలో కొందరు అయ్యో .. అంటున్నారు.  

ఈ నేపధ్యంలో విజయసాయి రెడ్డికి మరోమారు రాజ్యసభ అవకాశం అయినా ఇస్తారా లేక అక్కడా మొండి చేయి చూపిస్తారా అనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయ సాయి రాజ్యసభ పదవీ కాలం ముగింపు దశకు చేరుకుంది. ఆయనతో పాటుగా రాష్ట్రం నుంచి ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ, మొత్తం నలుగురు పెద్దల సభ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనునుంది.  మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.ఈసారి నాలుగు స్థానాలు కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం వుంది. నిన్న మొన్నటిదాకా అందులో ఒకటి విజయ సాయి రెడ్డికి  ఖాయమనే ప్రచారం జరిగింది. జగన్ రెడ్డి, విజయ సాయిని రీ నామినేట్ చేస్తారని భావించారు. 

అయితే తాజా పరిణామాల నేపధ్యంతో పాటుగా, తెరపైకొస్తున్న కొత్త సామాజిక సమీకరణల నేపధ్యంలో, విజయ సాయికి, పెద్దల సభలో కుర్చీ డౌటే అంటున్నారు. నిజానికి,  విజయసాయి పక్కా అనే లెక్కతో, ఇంతవరకు పార్టీలో అందరూ మూడు ఖాళీల గురించే మాట్లడుతూ వచ్చారు. మూడు స్థానాల్లో ఒకటి మైనార్టీ..మరకొటి ప్రముఖ పారిశ్రామిక వేత్త సతీమణి..మరొకటి బీసీ లేదా ఎస్సీ కి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా, సినిమా రంగం నుంచి ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి- రాం చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా నిర్మాత, న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది.దీంతో.. విజయ సాయిరెడ్డికి మరో షాక్ తప్పదా అనే చర్చ మొదలైంది. కాగా, బీసీ వర్గం నుంచి బీదా మస్తాన రావుపేరు ప్రముఖంగా వినిపిస్తోంది.అలాగే, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ కుటుంబ సభ్యులకు ఒక సీటు ఖాయమని అంటునారు. అయితే, ఏది ఏమైనా, విజయ సాయిరెడ్డిని పక్కన పెట్టరని, ఢిల్లీలో ఉన్న అవసరాల దృష్ట్యా ఆయనకు మళ్ళీ  అవకాశం ఇస్తారని పార్టీ నేతలు కొందరు ఇంకా నమ్ముతున్నారు. అయితే, సజ్జల వర్గం మాత్రం, నో వే, విజయసాయి మళ్ళీ పైకి లేచే ఛాన్స్ లేదని, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నదే తమ ఆలోచనగా చెపుతున్నారు. అయితే, చివరకు జగన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో ... అనే మాట అయితే ఇటు సాయి రెడ్డి వర్గంలో, అటు సజ్జల వర్గంలో వినిపిస్తోంది.

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.