ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. మూడు రాజధానుల ముచ్చటే లేదు!

Publish Date:Mar 14, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో  మూడు రాజథానుల అంశం ప్రస్తావనే లేకపోవడంపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ కానీ, ఆయన కేబినెట్ సహచరులు కానీ ఖాతరు చేయకుండా అవకాశం ఉన్నా లేకున్నా.. సందర్భం వచ్చినా రాకున్నా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు మా విధానం అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సైతం తాను త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తానంటూ గ్లోబల్ సమ్మిట్ కు ముందూ, సమ్మిట్ వేదికగానూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంలో కచ్చితంగా మూడు రాజధానుల ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణ అన్న అంశాన్ని ఇసుమంతైనా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు కారణంగానే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన జొప్పిస్తారని పరిశీలకులు సైతం అంచనా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రస్తావనకు చోటు లేకుండా పోయింది. గవర్నర్ కు ఇచ్చే ప్రసంగ పాఠంలో ఆ అంశాన్ని జొప్పించే ధైర్యం జగన్ సర్కార్ చేయకపోవడానికి ఆయన సుదీర్ఘ కాలం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ ఆ అంశాన్ని  జొప్పించినా గవర్నర్ అది చదవడానికి నిరాకరించి ఉండేవారన్న భావనతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని పరిశీలకులు చెబుతున్నారు.

ఆ ఒక్క అంశం వినా గవర్నర్ ప్రసంగం మొత్తం జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూనే కొనసాగింది. ఏపీ సర్కార్ పారదర్శక పాలన అందిస్తోందని అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.   పేదల సంక్షేమమే లక్ష్యంగా   పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో పథకాల సొమ్ములు క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో తన సర్కార్ సుపరిపాలన అందిస్తోందన్నారు. అర్థిక రంగంలో ఏపీ పురోగమిస్తోందనీ, వ్యవసాయం, పారిశ్రామిక రంగం సహా అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయనీ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

. కాగా గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటు ప్రస్తావన రాగానే తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో గణాంకాలన్నీ కల్పితాలేనని విమర్శించారు. గవర్నర్ నోట జగన్ సర్కార్ అబద్ధాలు పలికిస్తోందంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 9 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16న సభలో విత్త మంత్రి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.