హోంమంత్రి బాధ్యతా రాహిత్యం.. శాంతి భద్రతలు ఎక్కడ తానేటి వనితా మేడం

Publish Date:May 3, 2022

Advertisement

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత వైఖరి. రాష్ట్రంలో ఏం
జరిగినా అది విపక్ష తెలుగుదేశం పనే అంటున్నారామె. రాష్ట్రంలో రోజూ మూడు మర్డర్లు, ఆరు రేపులు అన్నట్లుగా నేర సామ్రాజ్యం వర్ధిల్లుతుంటే.. నేరలను అరికట్టి నేరగాళ్ల పీచమణచాల్సిన పదవిలో ఉన్న తానేటి వనిత  విపక్షాలపై నెపం మోపి బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం దారుణం.  ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.    అత్యాచార ఘటనలపై సహజంగానే విపక్షాలు విమర్శలు సంధిస్తాయి. నేరాలు వరుసగా అదుపులేకుండా జరుగుతున్నాయంటే అది కచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమే. శాంతి భద్రతల పరిరక్షణకు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాల్సిన హోంమంత్రి విపక్ష టిడిపి వాళ్ల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యం తప్ప మరొటి కాదు.  రేపల్లె సామూహిత అత్యాచారం సంఘటనకు మద్యం మత్తే కారణమంటూ తేలిగ్గా తీసుకోవడం హోంమంత్రికి అందునా ఒక మహిళకు ఎంత మాత్రం తగదు. ఇటువంటి సంఘటనలు ఏపీలో నిత్యకృత్యంగా మారిపోవడం అన్నది రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి.

చట్టాలు చేశామని చెప్పుకుంటే సరిపోదు. అవి సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.  ఎపిలో చోటు చేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలను మహిళలు బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది.  ఆంధప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా మంత్రుల స్థాయిలో ఉన్న వారు కూడా నేరస్తులకు వత్తాసు పలుకుతున్నట్లుగా మాట్లాడటం వారిని ప్రోత్సహించడం తప్ప మరొకటి కాదు.  మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించడం కూడా ప్రభుత్వ వైఫల్యమే.  ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు వేయాలి. అలా కాకుండా సర్కార్ ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో నేరాలు పెట్రేగిపోతున్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. కొన్ని సంఘటనల్లో అధికార పార్టీ వారి జోక్యం వల్ల పోలీసులు నిందితులను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో నేర సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా విస్తరించడానికి కారణమౌతున్నది.

ఈ వాస్తవాలన్నిటినీ పట్టించుకోకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ విపక్షమే కారణమంటూ హోంమంత్రి నిర్ధారణకు వచ్చేయడం బాధ్యతా రాహిత్యం కాక మరొకటి కాదు.    ఖజానా నింపడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్టాలు, ఆ మత్తులో జరిగే నేరాలకు బాధ్యత వహించి తీరాలి. ఆ నేరాల్ని పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు 2019 మార్చిలో తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో నిందితులు చేసే నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత అంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. అంటే మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే కాదు.. ఆ కారణంగా అకృత్యాలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకుం టున్న అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు. అఘాయిత్యానికి ఒడిగట్టారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు  కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకున్న తండ్రిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన తల్లిని బండరాయితో వెూది చంపేశాడు. అనంతపురం జిల్లాలో 33 ఏళ్ల యువకుడు   కన్నతల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎంత వారించినా వినకపోవటంతో తల్లిదండ్రులు అతడిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో కన్న కుమార్తెపైనే అత్యాచారయత్నం చేసిన ఘటన కొన్నాళ్ల కిందట ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. ఇక అంతకుముందు స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో నెల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది.  సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సవిూపంలో ఉన్న సీతానగరం పుష్కర్‌ ఘాట్‌కు.. కాబోయే భర్తతో కలిసి విహారానికి వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘దిశ’ ఏమైందో, ఎక్కడుందో తెలియడం లేదు. నేరాల నియంత్రణ విషయంలో శాంతి భద్రతలను నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ దిశ, దశ లేక నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోయింది. పోలీసుల విధి నిర్వహణలో ప్రభుత్వ మితిమీరిన జోక్యమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో పులివెందుల రాజ్ నడుస్తోందన్న విపక్షాల విమర్శలు వరుసగా జరుగుతున్న అకృత్యాలు  వాస్తవమే అనిపించేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.