ప్రపంచ ఆర్థిక సదస్సుకు జగన్ కు నో ఇన్విటేషన్.. అసలు ఏపీని పట్టించుకోలేదు!

Publish Date:Jan 16, 2023

Advertisement

ఏటా దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు ఈ ఏడాది కూడా  దావోస్ లో జరుగుతోంది. అయితే ఈ సదస్సుకు నిర్వాహకులు ఏపీ సీఎంను పట్టించుకోలేదు.  పేరుకు యాక్టివ్ భాగస్వాములు అని అంటారు కానీ.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆహ్వానం పంపుతారు. ఏటా ఇది జరిగేదే..కానీ ఈ  సారి మాత్రం ఏపీకి ఆహ్వానం దక్కలేదు.  

సాటి తెలుగు రాష్ట్రం అయిన  తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం అందింది.    తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైంది’ అని  కేటీఆర్ కు అందిన ఆహ్వానంలో ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ సీఎం జగన్ కు  అందింది.  ఈ కారణంగా సీఎం జగన్ కూడా తన ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లారు. అయితే ఈ సారి దావోస్ కు ఏపీకి ఆహ్వానమూ అందలేదు.. ఏపీ నుంచి ప్రతినిధి బృందమూ వెళ్ల లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ ఏడాది ఏపీ నుంచి  ప్రతినిధి బృందం వెళ్లేది. ఏపీని గొప్పగా ప్రమోట్ చేసేవారు.

 కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నది.. దీంతో ఏపీ వైపు పెట్టుబడిదారులు చూడటం లేదు.  అయినా దావోస్ నుంచి ఆహ్వానం అందినా, జగన్ పెద్ద ప్రతినిథి బృందాన్ని వెంటపెట్టుకుని వెళ్లినా పెద్దగా ఒరిగేదేం లేదని గత ఏడాది ఆయన దావోస్ పర్యటన ద్వారా తేలిపోయింది. అందుకే ఈ సారి దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును జగన్ సర్కార్ లైట్ గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్వానం వచ్చినా.. ఆయన వెళ్లాలన్నా మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అలా తీసుకుని వెళ్లినా ఏపీలో పరిస్థితులు తెలిసిన పారిశ్రామిక వేత్తలెవరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. గత ఏడాది జగన్ ఆర్భాటంగా దావోస్ వెళ్లినప్పటికీ ఆయన పర్యటన మొత్తం వివాదాస్పదంగానే మారింది.

భార్యతో విహార యాత్రకు వెళ్లిన చందంగా ఆయన దావోస్ పర్యటన ఉందన్న విమర్శలు వెళ్లువెత్తాయి. ఆయన దావోస్ పర్యటనకు బయలు దేరడానికి ముందే అప్పట్లో మంత్రులు ఈ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న భ్రమలు వద్దని చెప్పేశారు. పెట్టుబడులు వస్తాయన్న ఆశలు లేనప్పుడు దావోస్ వెళ్లడమెందుకని అప్పట్లోనే విమర్శలు వెళ్లు వెత్తాయి.  

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.