హస్తినలో బీఆర్ఎస్.. క్యా సీన్ హై!

Publish Date:Dec 15, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం దొరకదు. దాదాపునాలుగేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాలలో  ప్రవేశం కోసం చేయని ప్రయత్నం లేదు.. కలవని పార్టీ లేదు.  

ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరకు, బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ మొదలు యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేతఅఖిలేష్ యాదవ్  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి  తమిళనాడు సీఎం స్టాలిన్ దాకా అందరినీ కలిసారు.  వీళ్లూ వాళ్లూ అని లేకుండా బీజేపీ యేతర పార్టీల నేతలందరినీ కలిశారు. కానీ జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని మినహాయిస్తే ఇంకెవరూ కేసీఆర్ తో కలిసి నడవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.  దీంతో ఆయన  తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)  పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి జంప్ చేసేశారు.

కానీ బీఆర్ఎస్  జాతీయ పార్టీ అని, కేసీఆర్ ఆయన పరివారం ఎంతగా ప్రచారం చేసుకున్నా అదిఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ కాదు. దానికా గుర్తింపు రాదు. సరే అధికారిక గుర్తింపు సంగతి పక్కన పెడదాం. కానీ జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి ఏమైనా స్వాగతం లభిస్తోందా? అంటే దానికీ సంతృప్తి కరమైన సమాధానం రాదు. సరే హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఆర్భాటంగా యాగం చేసి మరీ ప్రారంభించిన కేసీఆర్ కు అక్కడైనా ఏమైనా సానుకూల స్పందన లభించిందా అంటే అదీ లేదు.

హైదరాబాద లో పార్టీ ఆవిర్బావ సభకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి మాత్రమే వచ్చారు. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి కుమారస్వామికి అదనంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఒకరు కలిశారు అంతే. పోనీ జాతీయ మీడియా అయినా రాజకీయ యవనికపై ఒక కొత్త పార్టీ వచ్చి చేరిందన్న ఆసక్తి కూడా కనబరచలేదు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం వ్యవహారం అంతా ఏదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారంగా జాతీయ మీడియా లైట్ తీసుకుంది. బీఆర్ఎస్ ను అస్సలు పట్టించుకోలేదు.

ఏదో ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకుని ఢల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకుంటోందంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించింది. దేశ రాజధాని నగరంలో యాగం చేసి, నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లతో హడావుడి చేసినా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తలకు జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోలేదు.  ఇటీవలి కాలంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా కేసీఆర్ జాతీయ మీడియాకు కోట్లాది రూపాయల అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. జాతీయ చానెళ్లకైతే స్లాట్లు తీసుకుని మరీ తెలంగాణ మోడల్ అభివృద్ధిని ప్రచారం చేసుకున్నారు.  అవేవీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కవర్ చేసే విధంగా జాతీయ మీడియాను కదిలించలేకపోయాయి. అంతే కాకుండా బీఆర్ఎస్ కు జాతీయ, అంతర్జాతీయ మీడియా కో ఆర్డినేటర్ గా కేసీఆర్ తన బిడ్డ కవితను నియమించారనీ, ఆమె రికమెండ్ చేసిన విధంగా ఒక పీఆర్వోను కూడా నియమించారనీ అంటున్నారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనీసంగా కూడా ప్రచారం చేయించుకోలేకపోయారు.

మీడియా సంగతి పక్కన పెడితే ఢిల్లీలోనే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసలు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం జరుగుతోందనే గుర్తించ లేదు. కనీసం అటుకేసి తొంగి చూడలేదు. ఆయన ఆహ్వానం అందిందా? అందలేదా అన్నది వేరే ప్రశ్న.. కానీ బీజేపీని వ్యతిరేకించే బలమైన పార్టీ నాయకుడిగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరో బీజేపీ వ్యతిరేక పార్టీ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడమే బీఆర్ఎస్ విషయంలో ఆయన వైఖరి ఏమిటన్నది స్పష్టమౌతుంది. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వీరెవరూ ఇటు కేసి కనీసం చూడను కూడా చూడ లేదు. దీనిని బట్టి చూస్తే పేరు మార్పు తప్ప బీఆర్ఎస్ తో కేసీఆర్ సాధించిందేమీ లేదని పరిశీలకలు అంటున్నారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరు మార్పు ప్రహసనంగానే మిగిలిపోయిందంటున్నారు.  

By
en-us Political News

  
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.