Publish Date:Nov 27, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే తమ పార్టీ ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైందని గగ్గోలు పెడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి అనూహ్య విజయం తరువాత కూడా జాతీయ స్థాయిలో పలు బీజేపీయేతర పార్టీలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
తాము విజయం సాధించిన సందర్భాలలో ఈవీఎంలు భేష్ అంటూ, ఓటమి పాలైతే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీలకు సుప్రీం కోర్టు తన తాజా తీర్పు ద్వారా చెక్ పెట్టింది. విషయమేంటంటే.. ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ ఇటీవల సుప్రీం కోర్టులో దేశంలో మళ్లీ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరిగే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వీబీ వార్లేలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం (నవంబర్ 26) డిస్మిస్ చేసింది.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు మీరు గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ మాట ఉండదు. ఓటమి పాలైనప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా? అంటూ ప్రశ్నించింది. విదేశాలలో ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలోనే జరుగుతున్నాయని పాల్ వాదనను కోర్టు తోసిపుచ్చుతూ భారత్ మిగిలిన దేశాల కంటే భిన్నంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించింది. చివరిగా పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-going-back-to-paper-ballots-25-189053.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.