ఫ్రంటూ లేదు గింటూ లేదు.. కేసీఆర్ నిర్వేదానికి కారణమేంటంటే?

Publish Date:Apr 22, 2022

Advertisement

కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం బీజేపీకి అధికారాన్ని సంపాదించి పెట్టింది. యూపీఏ 1, యూపీఏ 2 వైఫల్యాల ప్రభావంతో 2014 ఎన్నికల సమయంలో మోడీ నినాదం కాంగ్రెస్ ముక్త భారత్ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో పాటు నాడు బీజేపీ అధికారంలోనికి రావడానికి నల్లధనంపై పోరాటం, విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తాం వంటి వాగ్దానాలూ బీజేపీ విజయానికి దోదహపడ్డాయి. అయితే ఎనిమిదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్నే నమ్ముకుని ముందుకు సాగుదాం అనుకుంటున్న కమలనాథుల కలలు నెరవేరడం లేదు.
కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్నది పేరుకే ఎన్డీయే సర్కార్. కానీ ఎన్డీయే కూటమిలో సొంత గళం వినిపించగలిగే భాగస్వామ్య పక్షం దాదాపు లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర పార్టీలు ఏకమైతే తప్ప మోడీని దీటుగా ఎదుర్కొనడం సాధ్యం కాదన్న నిశ్చితాభిప్రాయానికి దాదాపు అన్ని పార్టీలూ వచ్చేశాయి. 
గతంలో అయితే...అయితే ఎన్డీయే, కాకపోతే యూపీఏ అన్నట్లుగా కూటములు ఉండేవి. అయితే 2014 తరువాత నుంచి దేశంలో కాంగ్రెస్ ప్రభావం గణనీయంగా తగ్గడంతో ఆ పార్టీ వెనుక కూటమి కట్టేందుకు పార్టీలు పెద్దగా ఆసక్తి కనబరచని పరిస్థితి ఏర్పడింది. కానీ 2024 ఎన్నికలు సమీపానికి వచ్చే సరికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీకి ఉన్న పార్లమెంటు సభ్యుల బలంతో సంబంధం లేకుండా ఆ పార్టీ లేకుండా బీజేపీయేతర కూటమి ఏర్పడే అవకాశం లేదన్న నిర్ధారణకు బీజేపీయేతర పార్టీలు వచ్చేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓట్లూ, సీట్లూ  విషయంలో గతంలోలా కమాండింగ్ పొజిషన్ లో లేకపోయినా, ఆ పార్టీ లేకుండా బీజేపీని ఢీ కొనడం అంత తేలిక కాదని బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా నిర్ధారణకు వచ్చేశాయి. క్షేత స్థాయిలో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న బలమైన పునాదులే అందుకు కారణం
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటే...

కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జాతీయ స్థాయిలో ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నుంచి స్పందన లేకుండా పోయింది. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలలో భాగంగా జరిగిన సమావేశాలలో కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర ఫ్రంట్ అసంభవమన్న అభిప్రాయాన్నే టీఆర్ఎస్ మినహా మిగిలిన బీజేపీయేతర పార్టీలన్నీ వ్యక్తం చేశాయి. దీంతో కేసీఆర్ పరిస్థితి వ్రతమూ చెడింది...ఫలతమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఫ్రంట్ నేతగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామనుకున్న ఆయన ఆశలకు ఆదిలోనే హంసపాదు పడింది. 
ఆది నుంచీ బీజేపీకి అన్ని విషయాలలోనూ మద్దతుగా నిలబడిన ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో బీజేపీ వ్యతిరేకులలో చాంపియన్ అనే ముద్ర కోసం ఆ పార్టీ వ్యతిరేక విధానాన్ని అవలంబించారు. అందులో భాగంగానే వడ్ల కొనుగోలు నుంచి....తెలంగాణకు మోడీ సర్కార్ అన్యాయం చేసిందంటూ ఆ పార్టీపై రణభేరి మోగించారు. 
ఆయన మోడీ సర్కార్ వ్యతిరేక వైఖరి కారణంగానే రాష్ట్రంలో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న బీజేపీ ప్రతి విమర్శలతో పుంజుకుని తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందా అన్న భావన కలిగేలా కార్యక్రమాల జోరు పెంచింది. 
ఇప్పుడు మూడో ఫ్రంట్ ప్రయత్నాలు తుస్సుమనే సరికి కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల ను ఢీ కొంటూ..ఒంటరిగా జాతీయ రాజకీయ యవనికపై తన ముద్ర చాటుకోవడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ దశలోనే ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదు...నేనే జాతీయ పార్టీ పెడతా అంటూ ప్రకటన చేసేశారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి గుర్తింపునకు తాపత్రేయ పడటం కేసీఆర్ తోనే ప్రారంభం కాలేదు. ఆయనతోనే అంతం కాదు. కానీ ఇప్పటికప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వల్ల అదనంగా చేకూరే ప్రయోజనమేమిటన్నదానిపైనే అందరి సందేహాలూ... 
-ఐక్యంగా లేకుంటే నష్టమే అని..
ఢిల్లీలో కనీసం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానైనా కలవడానికి ఇష్టపడని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ క్రేజీవాల్‌ కూడా బీజేపీని ఎదుర్కోనే క్రమంలో కాంగ్రెస్‌ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. రాబోయే గుజరాత్‌ ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే దిశగానూ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినట్లు తాజా ఉమ్మడి లేఖద్వారా తేటతెల్లం అయింది. కానీ కేసీఆర్‌ ను కనీసం బీజేపీ వ్యతిరేకిగా గుర్తించకపోవడం బహుశా మొన్నటిదాకా ఆయన వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్లపాటు బేషరతుగా మద్దతు పలికి, మోదీ సర్కార్‌ చేసిన అన్ని చట్టాలనూ సమర్థించిన కేసీఆర్‌.. ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విభేదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బీజేపీ అనుకూల పార్టీలను ఒప్పించడంలో విఫలం..
ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప.. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను కలిసి, వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేయలేదు. కనీసం పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్‌ ను కూడా కలవని వైనాన్ని ప్రధాన ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్‌ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు.. కేసీఆర్‌–టీఆర్‌ఎస్‌లో బీజేపీ వ్యతిరేక పంథాలో నిలకడ ఎంత? అనే ప్రశ్న తలెత్తుతోందని విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.