మోడీ సర్కార్ కు ఎన్నికల కోడ్ లేదా? వర్తించదా?

Publish Date:Nov 16, 2023

Advertisement

ఎన్నికలకు ముందు వాగ్దానాలు, వరాలు కురిపించడం రాజకీయపార్టీలకు మామూలే. అవి అమలు చేయగలమా? లేదా? అన్న విషయం పట్టించుకోకుండా.. ఎన్నికలలో ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా పార్టీలు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించడం కొత్తేమీ కాదు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత సంయమనం పాటించాలి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలూ ఓటర్లకు ఆకస్మిక ధనలాభం చేకూర్చే వాగ్దానాలు చేయరాదు. ఎన్నికల సంఘం ఇటువంటి వాగ్దానాలపై కన్నేసి ఉంచాలి. అయితే ఆ పని ఎన్నికల సంఘం సక్రమంగా చేస్తోందా అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తుంది.

ఎందుకంటే ఇటీవల ఛత్తీస్ గఢ్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ   ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ పథకాన్ని మరో అయిదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి  గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన  కింద కోవిడ్‌ సమయంలో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఈ పథకాన్ని 2022డిసెంబర్‌ నెలలో జాతీయ ఆహార భద్రతా చట్టంలో విలీనం చేసి, మరో ఏడాది పాటు  పొడిగించారు. ఆ పథకం ఈ ఏడాది డిసెంబర్‌ నెలతో ముగుస్తోంది. అటువంటి పథకాన్ని   మరో అయిదేళ్లు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చత్తీస్‌ గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేయడం ప్రజానీకాన్నే కాకుండా కేంద్రం లోని అధికారులు, మంత్రులను సైతం రెండు విధాలుగా ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ జనాభాలో సుమారు 60 శాతం మందికి వర్తించే ఈ బృహత్తర పథకాన్ని ఎకాయెకిన అయిదేళ్లపాటు పొడిగించడం ఈ ఆశ్చర్యానికి ఒక కారణమైతే.. ఆ ప్రకటన చేయడానికి ఆయన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణాన్ని ఉపయోగించుకోవడం మరో కారణం.

కచ్చితంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అనుచిత లబ్ధి పొందే దురాలోచనతోనే మోడీ ఎన్నికల ప్రచార సభలో ఈ ప్రకటన చేశారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ఎన్నికల నిబంధనలు అనేవి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు వర్తించవా? అని   నిలదీస్తున్నాయి. ఆ ప్రకటనపై ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం ఎటువంటి స్పందనా లేకుండా మౌనం వహించడాన్నీ ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదనడానికి ఇంత కంటే ఉదాహరణ కావాలా అని మండి పడుతున్నాయి. మోడీ ఎన్నికల నిబంధనలను ఇసుమంతైనా లెక్క చేయరనడానికి ఇంతకు ముందు కూడా పలు ఉదంతాలు రుజువులుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన పోలింగ్ బూత్ లో ఓటు వేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల చిహ్నమైన కమలాన్ని చేతిలో పట్టుకున్నారు.  ఆ సమయంలో ఆ తీరును ప్రశ్నించిన మీడియాకు ఆయన తాను కమలం పువ్వును కాకుండా, హస్తం గుర్తును పట్టుకుంటానా అని ఎదురు ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయంపై ఎన్నికల సంఘం నోటీసులు కూడా ఇచ్చింది. ఆ తరువాత వాటి సంగతి ఏమై ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఇక ప్రస్తుతానికి వస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉచిత బియ్యం పథకాన్ని ఏకంగా ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ ఎన్నికలలోనే కాకుండా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రయోజనం పొందడమే లక్షయంగా కనిపిస్తోంది.  అంతే కాకుండా ఈ ప్రకటన ద్వారా మోడీ తన ద్వంద్వ వైఖరిని తానే చాటుకున్నారు.

 దేశంలో  పేదరికం ఇదివరకటి స్థాయిలో లేదని మోడీ సర్కార్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నది. తన ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో 13  13.50 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చినట్టు మోడీ సర్కార్ ప్రకటించారు. ఇప్పుడు దేశంలో 60 శాతం మందికి మరో ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామంటూ మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించడం ద్వారా.. దేశంలో పేదరికం తగ్గడం మాట అటుంచి మరింత పెరిగిందని ఆయనే చెప్పినట్లు అయ్యింది. నిజంగానే దేశంలో పేదరికం తగ్గినట్లైతే ఈ పథకాన్ని ఎందుకు ప్రకటించినట్లు? వాస్తవానికి   ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశంలో పేదరికంగా బాగా తగ్గిపోయిందని గణాంకాలతో సహా వెల్లడించింది. 2004లో 39 శాతానికి పైగా ఉన్న పేద ప్రజానీకం  2019 నాటికి 12.7 శాతానికి తగ్గిపోయినట్టు పేర్కొంది. అదే నిజమైతే ఇన్ని కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేయడం ఎందుకు? ఎందుకంటే నిస్సందేహంగా ఎన్నికల లబ్ధి కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి విధాన ప్రకటన చేయడం కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే అని అంటున్నారు.  అయితే బీజేపీ, మోడీ మాత్రం దీనిని  ఎన్నికల వాగ్దానాల్లో భాగమని బుకాయిస్తోంది.  మిగిలిన పార్టీలు   ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నట్టే తాము కూడా వాగ్దానం చేశామని   వాదిస్తోంది. ఎన్నికల సంఘం మాత్రం మౌనం వహిస్తోంది. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.