అప్పూ లేదు.. అప్పాయింట్ మెంటూ లేదు.. హస్తినలో జగన్ పరువు గంగపాలు!

Publish Date:Aug 25, 2023

Advertisement

అప్పు అప్పు.. ఏపీ ప్రభుత్వానికి తెల్లారి లేచిన దగ్గర నుంచీ ఇదే యావ. ఏదైనా చేయండి ఈ నెల అప్పు దొరికేలా చూడండి. కేంద్రం అడిగినవన్నీ చేద్దాం కొత్త అప్పుకు అనుమతి వచ్చేలా చేయండి. మీరు ఎవరినైనా కలవండి.. అప్పు దొరకకుండా రాష్ట్రానికి  మాత్రం రావద్దు. మీరు తెచ్చే అప్పుతోనే ఇప్పుడు మన ప్రభుత్వం నడవాల్సి ఉంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకోండి. ఇదీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుల సృష్టి కోసం ఢిల్లీలో తాను నియమించుకున్న బృందానికి ఇచ్చిన, ఇస్తున్న ఆదేశాలు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అప్పు కోసం నానా తిప్పలు పడుతుంది. ఇప్పటికే కేంద్రం ఏం చెప్పినా కాదనకుండా చేస్తూ ప్లీజ్ ఈ ఒక్కసారికి అప్పు ఇవ్వండి అంటూ కేంద్ర పెద్దల వద్ద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న విన్నపాలు అన్నీ ఇన్నీ కాదు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నుండి సీపీఎస్ రద్దు వరకూ కేంద్రం పెట్టిన ఆంక్షలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తూ వచ్చారు. వాటి బదులు  అప్పు లాగేశారు.

 అయినా, ప్రభుత్వం నడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఏ నెలకి ఆ నెల వచ్చిన ఆదాయానికి తోడు కొంత అప్పు చేసి జీతాలు, పెన్షన్లు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఈ నెల ఇప్పటికి కూడా ఇంకా కొన్ని జీతాలు పెండింగ్ లోనే ఉన్నాయి. మరో వారం రోజులలో మరో నెల కూడా రాబోతుంది. మరోవైపేమో బటన్ నొక్కి చెల్లించాల్సిన పథకాలు బోలెడు ఉన్నాయి. ఇటు ప్రభుత్వ ఖర్చులకు.. అటు పథకాలకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తెచ్చారు.. కార్పొరేషన్ల రుణాలను అందిన వరకు ప్రభుత్వ ఖజానాలకు మళ్లించేసుకున్నారు. పంచాయతీల ఆదాయాన్ని కూడా ఖజానాలో జమ చేసుకుంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలకు గానీ.. కొత్తగా ఇటుక పెట్టేందుకు కూడా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. ముందు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్లు బాబోయ్ ఏపీ అంటూ రాష్ట్రం సరిహద్దు దాటి వెళ్లిపోయారు. ఇన్ని చేసినా ప్రభుత్వం నడిచే పరిస్థితి కానరావడం లేదు.

ఏది ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే కొత్త అప్పు పుట్టి తీరాలి. దీంతో కొత్త అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో నియమించుకున్న హైలెవల్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్న ఈ కమిటీ ఇప్పుడు ఏపీ లిక్కర్ బాండ్లను చూపించి కొత్త అప్పు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.  అయితే కేంద్రం మాత్రం ఇక  మీకు అప్పు పుట్టేందుకు వీలుగా ఎలాంటి సలహాలు, ఆదేశాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిందని అంటున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఢిల్లీలో ఏపీ అప్పుల కమిటీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కానీ, కేంద్రం పెద్దలు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారట.

 అయితే కేంద్రంలో జగన్ పరిస్థితి కూడా ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక మీదట ఓ లెక్క అన్నట్లు తయారైందని పరిశీలకులు అంటున్నారు. గతంలో సీఎం కోరడం తరువాయి ప్రధాని, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రులు ఆఘమేఘాల మీద అప్పాయింట్ మెంట్ ఇచ్చేసేవారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు జగన్ తో భేటీ అయ్యేవారు. కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.   సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు ఢిల్లీలో అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ప్రధాని మోడీ కాకపోయినా కనీసం అమిత్ షాతో అయినా అపాయింట్మెంట్ కావాలని కోరినా కేంద్రం నుండి ఎలాంటి అనుకూలత కనిపించడం లేదని చెప్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ అన్నీ లెక్కలేసుకొని ఆచితూచి అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ఏపీలో పొత్తుల ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. సోమవారం (ఆగస్టు 28) తెలుగుదేశం అధినేత   చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంది.ఆ విషయంలో ఇప్పటికే బీజేపీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు భేటీ అయ్యే వరకూ  జగన్ కు కేంద్రం పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకడం దుర్లభమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఒకవేళ చంద్రబాబు భేటీలో పొత్తుల చర్చలు సఫలీకృతమైతే ఇక జగన్ కు అపాయింట్ మెంట్ దొరికే అవకాశమే లేదని అంటున్నారు.   

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.