బొత్స బెదిరింపులకు కార్పొరేటర్లు భయపడేనా ?

Publish Date:Apr 18, 2025

Advertisement

విశాఖలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పై చర్చ రేపే

ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే  తయారైంది.  నిన్న మొన్నటి వరకూ  నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.  రాజ్యసభ సభ్యత్వం నుంచి సర్పంచి వరకు వైసీపీ నాయకులు  రాజీనామాలు చేసి కూటమి పార్టీల బాట పడుతున్నారు.  ఈ తరుణంలో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం అగ్నిపరీక్షగా మారింది. ఆ పార్టీకి కంటే..   ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకి విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం కీలకంగా మారింది. .

.విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులకు గాను 58 వార్డులో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు.  కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో ఇతర పార్టీలు ఇండిపెండెంట్ లను కూడా వైసీపీ బెదరించి తమలో కలుపుకుంది.  అయతే రాష్ట్రంలో  వైసీపీ అధికారం కోల్పోవడంతో విశాఖ మేయర్ పీఠం పై కూటమి నాయకులు కన్ను వేశారు.  దీనికి వైసీపీలోని అసంతృప్తి వర్గం పూర్తిస్థాయిలో సహకరించింది.  దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశం, జనసేన గూటికి చేరిపోయారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. అయితే ఇప్పడు కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీని వీడారు. తిప్పల వంశీ,  బెహరా భాస్కరరావు... ముత్తం శెట్టి ప్రియాంక లాంటి నాయకులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు

ఈ దశలో తమ పార్టీ సింబల్ పై గెలుపొందిన 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చర్చకు హాజరు కాకూడదని ఆ పార్టీ నాయకులు  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. అలాగే పార్టీ విప్ ను కూడా జారీ చేస్తున్నట్టు ప్రకటించారు.  పార్టీ ఆదేశాన్ని పాటించని వారిపై అనర్హత వేటు వేస్తామని కూడా బొత్స సత్యనారాయణ తాజాగా హెచ్చరించారు.  నిజానికి విశాఖ తాజా కార్పొరేషన్ కాలపరిమితి కేవలం పది నెలలు మాత్రమే ఉంది. ఈ దశలో న్యాయం పరమైన చిక్కులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.  దీంతో పార్టీ మారిన ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరూ కూడా బొత్స మాటలను లెక్కచేసే అవకాశం లేదు.  అన్నిటికంటే మించి కార్పొరేటర్లగా గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం చాలామంది వైసీపీ కార్పొరేటర్ లలో ఉంది.  ముఖ్యంగా ఒక కోటరీ చుట్టూ కార్పొరేషన్ వ్యవహారం సాగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ విషయంలో బీసీ కార్డును ఉపయోగించుకోవాలని భావించారు. అవిశ్వాసం ద్వారా బీసీ మహిళను అగౌరవ పరుస్తున్నారని బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపించారు. దీనికి కూటమి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. అసలు పేరుకు మేయర్ అయినప్పటికీ ఆమెను ఆ పార్టీ ఎప్పుడూ కూడా గౌరవించలేదని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి,  వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకుల పెద్దరికం మాత్రమే కనిపించిందని గుర్తు చేశారు. ఈ దశలో విశాఖ మేయర్ భవిష్యత్తుతో పాటు బొత్స సత్యనారాయణ పెద్దరికానికి ఈ అవిశ్వాస తీర్మానం అగ్నిపరీక్ష కానుంది.

By
en-us Political News

  
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.