ఎవరిని మార్చినా నో ఛేంజ్.. సెకండ్ ఛాన్స్ కు ..నో ఛాన్స్ ...

Publish Date:Nov 26, 2022

Advertisement

తత్త్వం బోధ పడింది. విషయం అర్థమైంది. సెకండ్ ఛాన్స్ కు నో ఛాన్స్ అనే నిజం కొంచం ఆలస్యంగానే అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డికి తత్త్వం బోధపడేందుకు కొంత సమయం పట్టింది కానీ  పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు  ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాగ్రహం ఏ స్థాయిలో వుందో, ముందుగానే గ్రహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ‘మీటల’ మీద ఆశలు పెంచుకుని తమకు ఇక తిరుగులేదని ధీమా వ్యక్తం చేసినా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మాత్రం ఆయన లెక్కలు సీరియస్ గా తీసుకోలేదు. అందుకే, గడపగడపకు కదలండి అంటూ ముఖ్యమంత్రి పదేపదే ముళ్ళ కర్రతో పొడిచినా, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు అంతగా కదలలేదు. అందుకే చాలా వరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పదవిలో ఉన్నంత వరకు వుందాం,అందినంత వరకు వెనకేసుకుందాం ఆ తర్వాత రాజెవరో .. రెడ్డెవరో అనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, గడప గడపకు వెళ్ళని వారికి మళ్ళీ టికెట్ ఉండదని ముఖ్యమంత్రి హెచ్చరించినా ఎమ్మెల్యేలు ఇచ్చినా పుచ్చుకునేది లేదులే అని మనసులోనే అనుకుంటున్నారో  ఏమో కానీ ఎవరిదారిన వారు దీపం ఉండగానే, ఇల్లు  చక్క పెట్టుకునే పనిలో పడిపోయారని, పార్టీ నాయకులు గుసగుసలు పోతున్నారు.  

ఎప్పుడైతే, ఎమ్మెల్యేలలో ఈ విధమైన నిర్లిప్తత బయటకు పొక్కడం మొదలైందో, ఎప్పుడైతే గడప గడపలో  చిత్కారాలు,చేదు అనుభవాలు ఎదురయ్యాయో అప్పుడే జగన్ రెడ్డికి తత్త్వం బోధపడడం మొదలైంది. అదే సమయంలో,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  బృందంతో పాటుగా ఇతర సర్వే సంస్థలతో చేయించిన సర్వేలు నో సెకండ్ ఛాన్స్   అని స్పష్టం చేశాయి, ఇక అక్కడి నుంచి జగన్ రెడ్డిలో కలవరపాటు మొదలైందని, అందుకే ఆయన, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. 

అయితే, రోగం ఒకటైతే మందు మరొకటి ఇస్తే ప్రయోజనం ఉందని  అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెతుక్కున్నట్లు ఉందని అంటున్నారు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇటీవల పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా, ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చారు. అయితే ఈ మార్పులు, చేర్పుల తతంగాన్ని, సూక్ష్మంగా పరిశీలిస్తే, ఇవ్వన్నీ అలంకార ప్రాయమైన ( కాస్మెటిక్) మార్పులే తప్ప ప్రయోజనం చేకూర్చే మార్పులు కాదని పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి డామినేషన్ ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా  చేసిన మార్పులు చేర్పులు, బూమరాంగ్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు. బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొద్ది మంది నాయకులకు పదవులు ఇచ్చినా, పక్కలో బల్లెంలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని జోడించడంతో పెద్దగా ప్రయోజానం ఉండదని అంటున్నారు.

పేరుకు ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించినా. పెత్తనం మాత్రం, రెడ్డి సామాజిక వర్గ చేతిలోనే ఉంటుందని, ఇది  అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్టు ఉందని అంటున్నారు. ఉదాహరణకు, బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర బోసుకు కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సమన్వయ కర్త బాధ్యతలు అప్పగించారు. అయితే, మిధున్ రెడ్డిని కూడా జత చేశారు. అలాగే, గుంటూరు, ఎన్టీఅర్ కృష్ణా జిల్లా బాధ్యతలను కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అప్పగించారు, ఆయన నెత్తిన ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితునిగా పేరున్న ఆళ్ళ అయోధ్య రామి రెడ్డిని కూర్చో పెట్టారు. అంటే పార్టీలో చేసిన మార్పులు చేర్పులు మసిపూసి మారేడుకాయ చేసేందుకు చేసే ప్రయత్నమే తప్ప  మరొకటి కాదని అంటున్నారు.  
నిజానికి వైసీపీలో మార వలసింది, మార్పు రావాల్సింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలోనే కానీ, మరెవరిలోనో కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైసీపీ పతనానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి అహంకార పూరిత ధోరణి, ఆనాలోచిత నిర్ణయాలు కారణం. అయితే, ఆయన  మాత్రం అందరిలో లోపాలు చూస్తున్నారే కానీ, అద్దంలో తనను తను మాత్రం చూసుకోవడం లేదు.

అలాగే, సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి ఆశలు పెంచుకున్నా, వాస్తవంలో సంక్షేమ పధకాల ప్రయోజనాలు పొందుతున్న వారిలో ఒక విధమైన అసంతృప్తి ఉంటే, పథకాలు అందని వారిలో మరోరకం అసంతృప్తి ఉందని అంటున్నారు. అతేకాకుండా సంక్షేమ పథకాలు అందుతున్నది మూడింట ఒక వంతు మందికి మాత్రమే అని ఈ లెక్కన చూస్తే, ముఖ్యమంత్రి లెక్క తప్పిందని తేలుతోందని, గడపగడపలో నిరసనకు ఇదే కారణమని అంటున్నారు. అందుకే, ముఖ్యమంత్రి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, సెకండ్ ఛాన్స్’కు నో ఛాన్స్ .. చాన్సే లేదని అంటున్నారు.

By
en-us Political News

  
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.