జగన్ లో బటన్ నొక్కుడు ధీమా మాయం

Publish Date:Mar 7, 2023

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశ్వాసం, జగన్ ను నమ్ముకున్న వాళ్ల విశ్వాసం రెండూ కూడా ఆవిరైపోయే పరిస్థితి వచ్చిందా?..  బటన్ నొక్కుతున్నాను.. మన ఓట్లకు ఏం ఢోకా లేదు, మీ పని మీరు చేయండి అంటూ జగన్ తరచూ తన పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ క్లాస్ పీకుతూ ఉంటారు. నా పని నేను చేస్తున్నాను, మీరే జనంలోకి వెళ్లడం లేదంటూ ఊదరగొట్టేస్తుంటారు. అటువంటి జగన్ ఇప్పుడు ఇక బటన్ నొక్కుడుకు అవకాశం లేని పరిస్థితుల్లో పడ్డారు.

ఔను బటన్ నొక్కుడు కొనసాగినంత కాలం అధికారానికి ఢోకా లేదు, జనం వ్యతిరేకత, ప్రజాందోళనలతో రాష్ట్రం గగ్గోలెత్తినా ఏం ఫర్వాలేదు, తానుబటన్ నొక్కుతున్నంత కాలం,  లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు పడుతున్నంత కాలం ఓట్లెక్కడికీ పోవు. ఇదీ ఇప్పటి వరకూ జగన్ లో ఉన్న విశ్వాసం. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు పరాభవాలు ఎదురైనా.. స్వయంగా ముఖ్యమంత్రి సభల నుంచే జనం పారిపోయినా.. మంత్రుల సభలకు ప్రజలు మొహం చాటేసినా జగన్ లెక్క చేయలేదు. విపక్షాల సభలకు జనం పోటెత్తి జయజయధ్వనాలు పలికినా జగన్ చిద్విలాసంగా పార్టీ నేతలకు, శ్రేణులకు ఆందోళన వద్దు.. ఓట్లూ మనవే, అధికారమూ మనదే.. అంటూ భరోసా ఇస్తూ వచ్చారు. పార్టీ నేతల్లో ధీమాకూ అదే కారణం. తమ నేత బటన్ నొక్కి సొమ్ములు లబ్ధిదారులకు పందేరం చేస్తున్నారు ఏం ఫర్వాలేదు అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడా ధీమా వారిలో కనిపించడం లేదు.

జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఆగిపోయాయా? అందుకూ నిధులు లేని పరిస్థితి వచ్చేసిందా? అంటే పార్టీ శ్రేణులే ఔనని అంటున్నారు.  ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దివాణంలా అయిపోయింది ఏపీ పరిస్థితి. దీంతో పార్టీ నేతలలో జగన్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. జనవరి నుంచి పథకాలు పెండింగ్‌లో ఉన్నాయి.  కేంద్రం ఇచ్చేసిన నిధులకు ఓ సారి తెనాలిలో బహిరంగసభ పెట్టి మీట నొక్కారు. అది బహిరంగం అయిపోవడంతో ఉత్తుత్తి బటన్ నొక్కుడులేనా జగన్ అంటూ విపక్షల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దానికి తోడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు రైతుల ఖాతాలలోకి సొమ్ములు జమ చేసినందుకు  ప్రధాని  కృతజ్ణతలు చెబుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఆ ట్వీటే జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కుడు వ్యవహారాన్ని బట్టబయలు చేసేసింది.

అదలా ఉంచితే గత డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న పథకాలకు జగన్ మీట నొక్కిన దాఖలాలు లేవు.  ఆసరా పథకాన్నే తీసుకుంటే..   కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ  ఇప్పుడు అతీగతీ లేకుండా పోయింది.  ఈ పథకం కింద నాలుగేళ్లపాటు రూ. 12500 బటన్ నొక్కుడు ద్వారా అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండ్‌లో ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలలో జనవరిలో సొమ్ములు జమ కావాల్సి ఉంది.  

ఇక తాజాగా జగనన్న  విద్యాదీవెన పథకం మరోమారు వాయిదా పడింది.  2022-23 విద్యా సంవత్సరానికి గాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ. 700 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్ని ఏపీ సర్కార్ ఈ పథకం కింద విడుదల చేయాల్సి ఉంది.   సంక్షేమ క్యాలెండర్ ప్రకారం గత నెల 28నే ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ తర్వాత దానిని మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.  అయితే ఇప్పుడు మరో సారి వాయిదా వేసింది. ఈ నిధుల విడుదల ఎప్పుడు అన్న విషయాన్ని కూడా తెలియజేయలేదు. 

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.