సిట్టింగులలో సీనియర్లకు నో అసెంబ్లీ టికెట్!.. జగన్ యోచన?

Publish Date:Jul 26, 2023

Advertisement

 ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ   తమ పార్టీలో ఏం జరుగుతున్నది? రానున్న ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందన్న క్లారిటీ పార్టీ నేతలకు, శ్రేణులకు ఇచ్చేశారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని కూడా కుండబద్దలు కొట్టేశారు. ఎమ్మెల్యేలతో పాటు మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ల విషయంపై కూడా ఫోకస్ పెట్టారు. 

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ  22 మంది ఎంపీలు విజ‌యం  సాధించగా, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రెబల్ గా మారారు. ఇక వైసీపీకి ఇప్పుడున్న 21 మందిలో నలుగురు ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎంపీగా పోటీ చేయ‌లేమ‌ని, అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా అధిష్టానానికి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో అనకాపల్లి ఎంపీ బీశెట్టి స‌త్య‌వ‌తి, అరకు ఎంపీ గొట్టేటి మాధ‌వి, విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. దీనికి వైసీపీ నుండి ఎలాంటి స్పందనా రాకపోవడంతో  వారు చాలా కాలంగా ఈ నలుగురు పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాలలో వైసీపీ కొత్త వారి  కోసం వేట మొదలు పెట్టింది.

మరో నలుగురు ఎంపీలను   ఈసారి అసెంబ్లీకి పంపాలని  జగన్ స్వయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అలాంటి వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉన్నారు. మొత్తంగా ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులను దించాల్సి ఉండగా.. మరో ముగ్గురు ఎంపీలు వారి మూడు స్థానాలలో ఓటమి చూడడం ఖరారని నివేదికలు రావడంతో వారిని కూడా మార్చాలని జగన్ భావిస్తున్నారు.  అంటే మొత్తంగా 21 మందిలో పది మంది పాత వారికి మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వనుండగా 11 మంది   స్థానాలలో కొత్త వారిని దించనున్నారు. 

కాగా, ఈసారి వైసీపీ సీనియర్ నేతలను పార్లమెంట్ కు బరిలో దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్రాలో విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లి లేదా విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు, కాకినాడ లోక్ సభ స్థానం నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఏలూరు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, నెల్లూరు నుంచి  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లను లోక్ సభ కు పంపాలని జగన్ భావిస్తున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.

ఇప్పటికే ఆయా నాయకులకు  పార్టీ నుండి ఆదేశాలు కూడా వెళ్లాయంటున్నారు.  కాగా, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ నుంచి, హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ని కర్నూల్ జిల్లాలో ఆయన సామాజికవర్గం అధికంగా ఉన్న సీటు నుంచి ఎమ్మెల్యేగా, విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని ఎచ్చర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు కసరత్తులు మొదలు పెట్టగా.. ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని ఆలోచన చేస్తున్న మిగతా ఎంపీల అసంతృప్తిని ఎలా చల్లార్చాలా అని మల్లగుల్లాలు పడుతున్నారంటున్నారు. జగన్ నిర్ణయం రుచించని వారు రెబల్స్ గా మారుతారన్న ఆందోళన కూడా పార్టీలో వ్యక్తమౌతోందంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.