బుద్దాకి తెలుగుదేశం పెద్దల నో అపాయింట్‌మెంట్!

Publish Date:Mar 8, 2025

Advertisement

బెజవాడ వెంకన్నని ఇక పక్కన పెట్టేస్తారా?

అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా బుద్దా వెంకన్న కలర్ ఇస్తారు. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం ఎరుగని బుద్దాకి పొలిటికల్‌గా నోరే ప్లస్ అవుతుంది  ఎంతటి వారిపైనైనా విరుచుకుపడిపోయే ఆ మాస్ ఇమేజే ఆయనను టీడీపీలో ఎమ్మెల్సీని చేసింది. ఒక్క టర్మ్ ఎమ్మెల్సీగా చేసి బెజవాడ తెలుగుదేశంలో తానొక్కడే నాయకుడ్ని అన్నట్లు ఫీలైపోతుంటారాయన. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ పార్టీకి తలనొప్పిగా మారుతుంటారు . అలాంటాయన ప్రస్తుతం పదవి కోసం, గుర్తింపు కోసం పడుతున్న పాట్లు హాట్ టాపిక్‌గా మారాయి.
 ఎన్ని చేసినా పార్టీ తనను కరుణించడం లేదని తెగ బాధపడిపోతున్నారట మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.  ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు, ఎన్ని తిప్పలు పడినా ఎవరూ పట్టించుకోవడం లేదని లబోదిబోమంటున్నారట. తనకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇప్పించమని పార్టీ పెద్దలందరి దగ్గరా మొత్తుకుటున్నారట. ఎమ్మెల్సీ రేసులో తాను ఉన్నానని తన పేరు కాస్త వేయండని మీడియా వాళ్లకి ఫోన్లు చేసి మరీ బతిమాలుకుంటున్నారట. 

తనకు తానుగా ఒక ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఫీలయిపోయే ఆ విజయవాడ టీడీపీ నాయకుడికి  ఏ లాబీయింగ్ కలిసి వచ్చిందో ఏమో కాని తెలుగుదేశం పార్టీలో  ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది . దాంతో మామూలుగానే మాస్ ఇమేజ్ ఉన్న ఆయన దూకుడు మరింత పెరిగిపోయింది . తెలుగుదేశం ఎంపీగా ఉన్నప్పుడు కేశినేని నానికి చుక్కలు చూపించారు వెంకన్న.  ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి మద్దతుగా నిలిచి,  కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు నిద్రపోలేదు. బుద్దా వెంకన్న దూకుడు టీడీపీకి ఎంత ప్లస్ అయిందో, అంతే మైనస్ అయిన సందర్భాలూ   ఉన్నాయి. చంద్రబాబు, లోకేశ్‌లపై నోటికొచ్చినట్లు చెలరేగిపోయే  మాజీలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారిని తన స్టైల్లో టార్గెట్ చేస్తూ బుద్దా వెంకన్న తన మాస్ ఇమేజ్ మరింత పెంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ తన అనుచరులతో దండెత్తినప్పుడు, బుద్దా వెంకన్న అడ్డంపడి పార్టీలో మంచి మార్కులే కొట్టేశారు .

ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో  విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన బుద్దా చాలా హడావుడే చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసి కలకలం రేపారు. భారీ బల ప్రదర్శనతో ఇంద్రకిలాద్రీ కొండెక్కి టికెట్ కోసం మొక్కులు మొక్కుకున్నారు. అయినా వెంకన్నకు టికెట్ రాలేదు కానీ,  అధిష్టానం మాత్రం అతి చేయవద్దని గట్టిగానే చీవాట్లు పెట్టింది. 

ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వడంతో ఆ పదవిపై కన్నేసిన ఆయన మళ్లీ తన స్టైల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారట. గుర్తింపు కోసం పార్టీ చెప్పకపోయినా సరే.. ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ  బ్రేకింగులు వేయించుకునేవారాయన. చివరికి ఆయన ప్రెస్ మీట్ల దెబ్బకి మీడియా వాళ్లు..కూడా బాబోయ్ బుద్దా వెంకన్నా అనాల్సి వస్తోందంట. ఎక్కడికీ కదలకుండా తన ఇంట్లోనే కూర్చుని ప్రతి రోజూ బుద్దా వెంకన్న ప్రెస్ మీట్లు పెట్టడాన్ని భరించలేక మీడియా వాళ్లు కూడా ఇక మేం రాలేం అన్నారట. ఆ తర్వాత కాస్త ప్రెస్ మీట్లు తగ్గించారు బుద్దావెంకన్న. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని న్యూస్ ఛానెల్స్ ను బ్యాన్ చేసింది. అయితే బుద్దా వెంకన్న ఆ ఛానెల్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటూ, ఆ ఛానెల్స్ లో తన బ్రేకింగ్స్ ఎక్కువ వచ్చేట్టుగా ప్లాన్ చేశారట. పాపం అదే బుద్దావెంకన్నకు మైనస్ అయ్యిందట. తాము ఆ ఛానెల్స్ ని బ్యాన్ చేస్తే నువ్వు ఆ ఛానెల్స్ వాళ్లతోనే ఎక్కువగా టచ్ లో ఉండడం ఏంటని పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట.

 రెండోసారి తనకు ఎమ్మెల్సీ కావాలంటున్నారు బుద్దావెంకన్న. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ వాయిస్ తానే వినిపించానని, చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ దాడికి వస్తే తానే అడ్డుకున్నానని, గతంలో కొడాలి నానిని తానే ఎదుర్కున్నానని అలాంటి తనకు ఎమ్మెల్సీ కచ్చితంగా ఇవ్వాల్సిందే అంటున్నారట. పైగా తాను ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిననీ, తాను గవర కులానికి చెందిన వాడిని కాబట్టి బీసీ కోటాలో అయినా తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారట.

 ఎన్నికల సమయంలో బుద్దావెంకన్న చేసిన ఓవరాక్షన్ కి టీడీపీ అధిష్టానం తీవ్రంగా మండిపడింది. బుద్దా బ్లడ్ ఎపిసోడ్‌పై పార్టీ పెద్దలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారంట. అలాగే మీడియాలో కవరేజ్ కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారని కోపంతో ఉన్నారంట. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజులు గా చంద్రబాబు, లోకేశ్‌లు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట.. ఎక్కడ అపాయింట్‌మెంట్ ఇస్తే తనకు ఎమ్మెల్సీ అంటారో అని పార్టీ పెద్దలు   బుద్దావెంకన్నను కలవడానికి  కూడా ఇష్టపడటం లేదంట . దాంతో ఆయన  తన ఫ్యూచర్ ఏంటో అర్థం కాక నెత్తినోరు బాదుకుంటున్నారట

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.