రాహుల్‌కు ప్రత్యామ్నాయం లేరు... ఖర్గే
Publish Date:Aug 27, 2022
Advertisement
కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత గులామ్‌నబీ అజాద్ బయటపడిన తర్వాత పార్టీలో అంతా గందర గోళం నెలకొన్నది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన వ్యతిరేకించడం, ఆ పదవికి ఆయన తగడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించగల నేత రాహుల్ గాంధీ మాత్ర మే అంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షపదవిని మళ్లీ స్వీకరించాలని తాము ఆయనను ఒప్పిస్తామని అన్నారు. ఖర్గే శనివారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా, వారికి దేశవ్యాప్తంగా మద్దతు లభించాలన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అందరూ మద్దతివ్వాలన్నారు. యావత్తు కాంగ్రెస్ పార్టీకి ఆ నేత ఆమోదయోగ్యుడై ఉండాలని అటువంటి నేత రాహుల్ గాంధీ మినహా మరొకరు లేరని అన్నారు. కాంగ్రెస్లో చేరి, పార్టీ కోసం పని చేయాలని సోనియా గాంధీపై సీనియర్ నేతలంతా గతంలో ఒత్తిడి తీసు కొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రాహుల్ కూడా వచ్చి, పోరాడాలని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ నేత వేరొకరు ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ ఇష్టపడటం లేదని జరుగుతున్న ప్రచారంపై మాట్లా డుతూ, పార్టీ కోసం, దేశం కోసం బాధ్యతలు చేపట్టాలని ఆయనను కోరుతామని చెప్పారు. ఆరెస్సె స్ , బీజే పీ లపై పోరాడుతూ, దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలును ఆమోదించవలసి ఉంది. ఆ పార్టీ వర్కిం గ్ కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో ఆదివారం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఎన్ని కల షెడ్యూలును ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు.
http://www.teluguone.com/news/content/no-alternate-to-rahul-says-kharge-25-142742.html