అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ కుమార్తె గగనను ఉన్నత చదువుల నిమిత్తం కాలేజీలో జాయిన్ చేసేందుకు అమెరికా వెళ్లారు. కూతురి అడ్మిషన్ ప్రక్రియ ముగించుకుని వారు బోస్టన్ నగరం నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మార్గమధ్యంలో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపైనే పలు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మధుయాష్కీ భార్య డాక్టర్ సుచీ యాష్కీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పక్కటెముకలు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కాగా మధుయాష్కి గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. కుమార్తెను ఎండి కోర్సులో జాయిన్ చేసే క్రమంలో లగేజీ ఎక్కువ ఉండటంతో డాక్టర్ సూచియాష్కి, మధుయాష్కిగౌడ్ వేర్వేరు కార్లలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మధు యాష్కిగౌడ్ రేపు ఆయన ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్టర్ సుచి యాష్కీ ఆరోగ్య పరిస్థితిపై మధుయాష్కీగౌడ్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nizamabad-mps-wife-injured-in-road-accident-36-221752.html
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్పల్లి మంజీరా మాల్లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.