అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య..!

Publish Date:Aug 12, 2026

Advertisement

 

ఇంటి కోసం రూ.90 లక్షల అప్పు చేసిన విద్యుత్ ఉద్యోగి..!

బ్యాంక్ లోన్ రాక బలవన్మరణం..!

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో  విషాదకర సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఆశతో చేసిన అప్పులు, తీర్చే మార్గం లేక పెరిగిన మానసిక ఒత్తిడి ఆ ఇంట కోలుకోలేని విషాదాన్ని నింపాయి. కట్టుకున్న భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు లోకాన్ని విడిచి వెళ్లడంతో ఇద్దరు చిన్నారి పిల్లలు  అనాథలయ్యారు.

ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో చోటుచేసుకుంది. జిల్లాలోని మోండోరా మండలం నాగంపేటకు చెందిన శేషాల నరేశ్‌కు (35), కోటగల్లికి చెందిన మేఘనతో (30) 2014లో వివాహమైంది. వీరికి అయాన్ష్ (9), మిథున్ (7) అనే ఇద్దరు కోడుకులు. తండ్రి మరణించడంతో నరేశ్‌కు ఐదేళ్ల కిందట విద్యుత్ శాఖలో అటెండర్‌గా ఉద్యోగం లభించింది. తన పనితీరుతో ఆరు నెలల కిందట జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కూడా పొందాడు. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఈఆర్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న నరేశ్, వినాయక్‌నగర్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే, గతేడాది సొంతింటి కల కోసం నరేశ్ సుమారు రూ.90 లక్షల భారీ మొత్తం అప్పు చేసి ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటిపై బ్యాంక్ లోన్ పొంది బయట చేసిన అప్పులు చెల్లించాలని నరేశ్ భావించాడు. కానీ ఊహించని విధంగా బ్యాంకు నుంచి లోన్ మంజూరు కాలేదు. దీనికితోడు బయట ఇచ్చిన వారి నుంచి వడ్డీలు, అసలు చెల్లించాలని ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో పరిస్థితి చేయిదాటక ముందే కొద్దిరోజుల కిందట ఆ ఇంటిని అమ్మేసి, వచ్చిన డబ్బులతో కొంతమేర బాకీలు తీర్చాడు. అయినప్పటికీ ఇంకా భారీ మొత్తంలో అప్పులు మిగిలిపోవడంతో నరేశ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు అతనికి మానసిక వైద్య నిపుణులతో చికిత్స కూడా అందిస్తున్నారు.

మంగళవారం ఉదయం ఇద్దరు పిల్లలు బడికి వెళ్లిన తర్వాత ఇంట్లో దంపతుల మధ్య తీవ్రమైన మానసిక మథనం జరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో మేఘన తల్లి లావణ్య ఫోన్ చేయగా, కుమార్తె మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా అనిపించింది. పిల్లల గురించి అడిగితే వేరే ఇంటికి పంపానని చెప్పి సంభాషణ ముగించింది. కలవరపడిన తల్లి గంటన్నర తర్వాత బంధువులతో కలిసి ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కిటికీ గుండా పరిశీలించగా ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. తలుపులు బద్దలుగొట్టి ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త నరేశ్ బెడ్‌రూమ్‌లో ఉరివేసుకోగా, భార్య మేఘన మరో గదిలో విషం తాగి ప్రాణాలు విడిచింది.

ఘటనా స్థలంలో నరేశ్ రాసిన లేఖ లభ్యమైంది. అప్పులు, అనారోగ్య సమస్యల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, తమపై ఉన్న కోపాన్ని చిన్నారి పిల్లలపై చూప వద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కోరాడు. తండ్రి రాసిన ఆఖరి లేఖను చూసి మనస్తాపానికి గురైన మేఘన ముందుగానే విషం తాగి ఉంటుందని, ఆ తర్వాత నరేశ్ ఉరివేసుకుని ఉంటాడని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Nizamabad couple suicide, Sheshala Naresh, Nizamabad crime news, Vinayaknagar suicide, debt trap suicide Telangana, Electricity department employee suicide

By
en-us Political News

  
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది. నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. అధికారులు ఆయన పేరును చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.
అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ ఆశా వర్కర్ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఘర్షణలకు, ప్రెస్ మీట్ల విమర్శలు-ప్రతివిమర్శలకు వేదికగా మారిన ముఖ్యమైన అంశాల్లో మెగా డీఎస్సీ ఒకటి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.