నీతిఆయోగ్ ర్యాంకింగ్స్.. ఏపీ స్థానం ఎక్కడ?

Publish Date:Jul 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల వాతావరణంపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ 'ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ఐఎఫ్ఐ తాజా ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 8వ స్థానానికి, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6వ స్థానానికి పరిమితమైంది. గతంలో  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'  ర్యాంకింగ్స్‌లో వరుసగా అగ్రస్థానంలో నిలిచిన ఏపీ, ఇప్పుడు టాప్-5 పెర్ఫార్మర్స్ జాబితాలో చోటు కోల్పోవడం పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న తరుణంలో ఈ నివేదిక వెలువడటం రాజకీయంగానూ వేడి పుట్టిస్తోంది.

గతంలో కేంద్రం నిర్వహించిన  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని నిలిపివేసి, మరింత సమగ్రంగా పెట్టుబడుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు నీతి ఆయోగ్ ఈ ఏడాది నుంచే సరికొత్తగా 84 సూచికలతో  కూడిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ 48.7 శాతం మార్కులతో  ఫ్రంట్ రన్నర్' విభాగంలో నిలిచింది.   పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 47.3 శాతం మార్కులతో 13వ స్థానాన్ని పొందింది. ఈ కొత్త ర్యాంకింగ్స్‌లో గుజరాత్ మొదటి స్థానంలోనూ ఆ తరువాత వరుసగా  మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిస్సాలు టాప్-5 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతిపాదిత పెట్టుబడుల్లో ( ఏకంగా 25.3 శాతం వాటాను ఒంటరిగా ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తున్నప్పటికీ, ఈ ర్యాంకింగ్స్‌లో ఎందుకు వెనుకబడాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆరోపిస్తున్నాయి. అయితే..  జాతీయ మీడియా కథనాలు, పారిశ్రామికవేత్తల స్పందనను పరిశీలిస్తే ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనేది వాస్తవం. మరి నీతి ఆయోగ్ ర్యాంకు తగ్గడానికి గల కారణమేంటంటే..  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన విఘాతంగా అర్ధమౌతున్నది. 

రాష్ట్రానికి ఉన్న భారీ అప్పులు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఏపీ మార్కులు తగ్గడానికి ముఖ్య కారణమని నీతి ఆయోగ్ విశ్లేషించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు అధికారికంగా 6లక్షల 36 వేల  కోట్ల రూపాయల అప్పు ఉండగా, బడ్జెటేతర  అప్పులతో కలిపి మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారం పేరుకుపోయింది. దీనికి తోడు..  గత కొన్ని సంవత్సరాలుగా సంక్షేమ పథకాల కోసం ఆదాయానికి మించి  చేసిన వ్యయం వల్ల రాష్ట్రానికి 'ఆర్థిక వెసులుబాటు కరవైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహా సంక్షేమ ఖర్చులు, వారంతపు ఆర్బీఐ అప్పులపై ఆధారపడటం ఈ ఇండెక్స్‌లో ప్రతిఫలించింది.

మరోవైపు, బిజినెస్ క్లైమేట్ విభాగంలో కూడా ఏపీ 9వ స్థానానికే పరిమితమైంది. నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా..  గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులను వేగవంతం చేస్తూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  అనే కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వెళుతోంది. నీతి ఆయోగ్ సైతం రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణను పెంచడానికి, విధాన స్థిరత్వాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది. రాష్ట్రం త్వరితగతిన మళ్లీ టాప్ పెర్ఫార్మర్ల జాబితాలోకి చేరాలంటే.. అనవసర వృధా ఖర్చులను నియంత్రించుకుంటూ, పటిష్టమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడమే ఏకైక మార్గం.

NITI Aayog Rankings,  Andhra Pradesh, Investment Friendly Index AP, AP Business Climate Rank,  Andhra Pradesh Economy Debts Ease of Doing Business AP

By
en-us Political News

  
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.