ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిమ్మగడ్డ పిటిషన్

Publish Date:Nov 7, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎంత అడ్డగోలుగా ఉందో అంతకు మించి ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. జగన్ మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్న జగన్ సర్కార్ వారి ద్వారా ప్రజల పర్సనల్ డేటాను సేకరించడంతో పాటు.. తమకు వ్యతిరేకులు ఎవరన్నది గుర్తించి వారి ఓట్ల తొలగింపు.. పెద్ద ఎత్తున దొంగ ఓట్ల చేర్పే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

పయ్యావుల వంటి వారు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల పుణ్యమా అని ఓటర్ల జాబితాలో అక్రమాలు వాస్తవమేనని తెలింది. కొందరు అధికారులపై వేటు కూడా పడింది. అయితే నిండా మునిగిన వాడికి చలేమిటన్న చందంగా ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా, ఫిర్యాదులు చేసిన కేంద్రఎన్నికల సంఘం కొరడా ఝుళిపించినా.. లెక్కేమిటన్న చందంగా జగన్ సర్కార్ అదికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. దొంగ ఓట్ల నమోదు.. ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియా కొనసాగుతోంది.

 ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో దొంగ ఓట్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అన్న సంస్థను స్థాపించి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు ఓటు హక్కు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లి మరీ ఓటు హక్కు పొందారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఓటు నమోదు చేయకతప్పని పరిస్థితిని ఎన్నికల సంఘం ఎదుర్కొంది. 

ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై న్యాయపోరాటానికి దిగారు.  ఏపీలో ఓట్ల అక్రమాలపై నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ గవాయి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చినా,  జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నాట్ బిఫోర్  అనడంతో విచారణ వాయిదా పడింది. 

ఏపీలో ఓటర్ల జాబితాలన్నీ పూర్తిగా వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా  జరుగుతున్నాయనీ, వీరంతా  వైసీపీ కార్యకర్తలేనని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించారని.. దీనిపై ఏపీ ప్రభుత్వ జోక్యం విపరీతంగా ఉందనీ నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు.  ఐప్యాక్ మాజీ ఉద్యోగులతో దొంగ ఓట్లు భారీగా చేరుస్తున్నారంటూ నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీలో ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకించిన డేటాను ప్రొఫైలింగ్ చేస్తున్నాయని నిమ్మగడ్డ ఆరోపించారు. ఓటర్ల జాబితాల అక్రమాల కోసం   రూ.68 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని కూడా నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటర్ల నమోదులోగ్రామ, వార్డు వలంటీర్లను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయడంపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.  సీజేఐ ఆదేశాలతో పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. మొత్తం మీద ఓటర్ల జాబితాలో అక్రమాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టీ పడేలా చేయడంలో నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ అయ్యారు. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.