నిమ్స్ హాస్పిటల్లో దారుణం.. అర్ధరాత్రి యువతిపై అసభ్య ప్రవర్తన..!

Publish Date:Aug 4, 2026

Advertisement

 

రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !

చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కామాంధులు ఎవరిని వదిలిపెట్టడంలేదు. చివరకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళను సైతం లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆసుపత్రి అంటే ప్రాణాలు కాపాడే చోటు.. రోగులకు భరోసా కల్పించే ప్రదేశం. కానీ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతికి  ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమిత మైన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన పంజాగుట్టలో కలకలం రేపింది.

నిమ్స్ హాస్పిటల్లో ఉన్నవారంతా అంతా గాఢ నిద్రలో ఉన్న సమయం.. ఆసుపత్రి వార్డులో నిశ్శబ్ద వాతా వరణం నెలకొంది. ఇదే అదనుగా భావించిన.. పక్క బెడ్‌లో చికిత్స పొందుతున్న రోగి అటెండెంట్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రెండు కాళ్లు విరిగి కదల్లేని పరిస్థితిలో ఉన్న తనపై అతడు అనుచితంగా ప్రవర్తించాడు. అనంతరం ఘటనతో తీవ్ర ఆందోళన కు గురైన యువతి జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు.

తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయా నికి సంబంధించిన ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూ లాన్ని నమోదు చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ యువతికి.. అదీ రెండు కాళ్లు విరిగి కదల్లేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఇలాంటి అనుభవం ఎదురవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆసుపత్రిలో రోగుల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున 3-4 మధ్య జరిగింది. అసలు తెల్లవారుజామున ఏం జరిగింది? యువతి చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం? ఘటన సమయంలో అక్కడ ఏం జరిగింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
Nimes Hospital, Panjagutta Police Station, Patient Attendant, Indecent behavior, ,CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police  


 

By
en-us Political News

  
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
విమాన ప్రయాణం అంటే సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది అని అందరూ భావిస్తారు. కానీ, నింగిలో ప్రయాణిస్తున్న వేళ ఊహించని విపత్తులు ఎదురైతే ఆ అనుభవం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.