కూలిన చర్చి పైకప్పు..60 మంది మృతి
Publish Date:Dec 11, 2016
Advertisement
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ నైజీరియాలోని ఉయో ప్రాంతంలో ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఓ చర్చిలో జనం గుమిగూడారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా చర్చి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో శిధిలాల కింద చిక్కుకుని 60 మంది దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిధిలాల కింద నుంచి ఇప్పటి వరకు 60 మృతదేహాలను వెలికి తీశారు. శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో చర్చిలో వందల సంఖ్యలో ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణ దశలో ఉన్న ఈ చర్చిని ప్రత్యేక ప్రార్థనల కోసమని హడావిడిగా ముగించేసినట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nigeria-church-accident-39-70164.html
http://www.teluguone.com/news/content/nigeria-church-accident-39-70164.html
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 30, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 29, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025
Publish Date:Dec 28, 2025





