నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు.. నిదా ఖాన్‌కు బెయిలు.!
Publish Date:Jul 7, 2026
Advertisement
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్ బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌కు నాసిక్ కోర్టు కండీషన్డ్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిదాఖాన్ కుఅరెస్ట్ అయిన 2 నెలల తర్వాత బెయిలు లభించింది. నాసిక్ రోడ్ కోర్టు అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న తౌసిఫ్ అత్తార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో మరో కీలక నిందితుడు డానిష్ షేక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, యూనిట్ లో మతమార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పరారయ్యారు. దాదాపు 42 రోజుల పాటు అజ్ఝాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు మేలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు కావడం, అలాగే తాను ప్రస్తుతం గర్భవతిగా ఉన్నానని, జైలు వాతావరణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పేర్కొంటూ నిదా ఖాన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. కార్పొరేట్ రంగంలో కలకలం రేపిన ఈ వ్యవహారంలో పలువురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ యాజమాన్యం కూడా తక్షణమే స్పందించింది. నిందితులైన ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. TCS Nashik conversion case, Tata Consultancy Services BPO controversy, SIT investigation Maharashtra
http://www.teluguone.com/news/content/nida-khan-granted-bail-36-225235.html





