ఏపీ సర్కార్ కు ఎన్జీటీ ఫైన్..రూ.5 కోట్లు

Publish Date:Nov 16, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుల్లో మొట్టికాయలు, హరిత ట్రైబ్యునల్ జరిమానాలు ఒక అలవాటుగా మారిపోయాయా. పర్యావరణ పరిరక్షణ, నిబంధనలు, కోర్టు ఉత్తర్వులు అంటే ఖాతరీ లేని తీరే ఇందుకు కారణమా అంటే పరిశీలకులు క్షణం ఆలస్యం చేయకుండా ఔనని బదులిచ్చేస్తున్నారు.

తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ సర్కార్ కు రూ.5 కోట్లు జరిమానా విధించింది. పేదలకు ఇళ్ల పేర ఏపీ సర్కార్ మడ అడవులను ధ్వంసం చేసేసిందని పేర్కొంటూ ఈ జరిమానా విధించింది. కాకిడాన శివారు దమ్మాల పేటలోని మడ అడవులను జగన్ ప్రభుత్వం ద్వంసం చేసేసిందని పేర్కొంది.  సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జగన్ సర్కార్  ఉల్లంఘించిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారించిన ట్రిబ్యునల్ పర్యావరణ విధ్వంసం వాస్తవమేనన్న నిర్ణయానికి వచ్చి ఈ మేరకు జరిమానా విధించింది.  

ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని ఎన్జీటీ తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్ జడ్-1ఏ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని విస్పష్టంగా ఆదేశించింది. మడ అడవుల సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం అధికార యంత్రాంగం ప్రయత్నించడం తగదని హెచ్చరించింది.  ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.  

ఈ జరిమానా మొత్తాన్ని మడ అడవుల సంరక్షణకు వ్యయం చేయాలని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. అలాగే అడవుల విధ్వంసం ఏ మేరకు జరిగింది, ధ్వంసమైన మేర అడవులను పునరుద్ధరించేందుకు ఎంత వ్యయం అవుతుంది అన్న అంశాలపై అధ్యయనం కోసం  ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.

By
en-us Political News

  
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.