ప్రియాంక, కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు
Publish Date:Nov 15, 2023
Advertisement
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసినందుకు గాను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. మోదీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమకు ఫిర్యాదు అందిందని, అందుకు సమాధానం చెప్పాలని ప్రియాంకకు పంపిన ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని సేవర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ఫిర్యాదు వచ్చింది. “ఒక సీనియర్ నేత, అది కూడా ఒక జాతీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్ చెప్పే మాటలు నిజమని ప్రజలు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో రుజువులు లేకుండా మాట్లాడటం సరికాదు. వాస్తవిక ప్రాతిపదికను కలిగి ఉండాలి’’ అని బిజెపి పేర్కొంది. నవంబర్ 16 రాత్రి ఎనిమిది గంటల్లోపు కారణాన్ని తెలియజేయాలని ఎన్నికల సంఘం ప్రియాంక గాంధీకి నోటీసులో పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా ఇదే తరహా నోటీసులు జారీ అయ్యాయి.ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గురువారంలోగా జవాబివ్వాలని అరవింద్ కేజ్రీవాల్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఆప్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అనైతిక వీడియో క్లిప్‌లను పోస్ట్ చేశారని బీజేపీ ఆరోపణ చేసిన విషయం తెలిసిందే.
http://www.teluguone.com/news/content/newsvideosec-issues-notice-to-priyanka-gandhi-25-165200.html





