స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jun 30, 2023

Advertisement

11.ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో రెండో సారి ఫైనల్లో బోల్తాపడ్డ టీమిండియా.. కొత్త డబ్ల్యూటీసీపై ఫోకస్ పెట్టనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తో డబ్ల్యూటీసీ కొత్త సీజన్ ను ప్రారంభించనుంది.
12. భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దంపతులకు శుక్రవారం బారసాల కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో  అద్భుతమైన బహుమతిని పంపించినట్టు సమాచారం. రూ. 1.20 కోట్ల విలువైన బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపించినట్టు తెలుస్తోంది. 
13. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలపై తెలుగుదేశం పార్టీ 'ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు' అనే పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. పుస్తకాన్ని విడుదల చేస్తున్న సమయంలో జగన్, వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.
14.ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించనున్న నేపథ్యంలో విద్యార్థులకు యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులెవరూ నలుపు రంగు దుస్తులు ధరించి రావద్దని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.
15. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన దర్వేష్‌ సాహెబ్ రెండు రోజుల క్రితం కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీంతో, పట్టణ ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
16. విశాఖలో గన్ లైసెన్సులపై నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ స్పందించారు. విశాఖలో 620 గన్ లైసెన్సులు ఉన్నాయని,  2020 నుంచి కేవలం 15 మందే తుపాకీ కావాలని దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
17.భారత విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) స్టాక్స్ స్థిరంగా కదులుతున్నాయి. ఈ స్టాక్ ఇటీవల పరుగులు పెడుతోంది.
18.జపాన్‌లోని నాగో నగరం ప్రజలు ఉదయం లేస్తూనే షాకయ్యారు. అక్కడి నది ఒక్కసారిగా ఎర్రగా మారిపోవడంతో ఏం జరిగిందో అర్థంకాక భయభ్రాంతులకు గురయ్యారు.
19.ఆర్టిఫీషియల్ స్వీట్ నర్  ఆస్పర్ టేమ్ కేన్సర్ కారకం కావచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చే నెలలో ప్రకటించనుంది. దీన్ని దీర్ఘకాలం పాటు తీసుకున్నప్పుడు కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది.
20. ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈరోజు ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.