స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 6, 2023

Advertisement

1.శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్‌ను ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడో తొలగించామని, ఆయన స్థానంలో తనను చీఫ్‌గా ఎన్నుకున్నారని పేర్కొన్నారు. 

2.తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

3.  రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌5జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందా? లేక ఇళ్ల పట్టాల పంపిణీ వరకే అనుమతించిందా? ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 


4.ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో ఇదే విషయం చర్చించినట్టు తెలిపారు. 

5. అమెరికా పౌరసత్వం పొందడం ఇకపై మరింత కఠినతరం కానుంది. విదేశీయులకు పౌరసత్వం ఇచ్చేందుకు నిర్వహించే నేచురలైజేషన్ పరీక్షలో అమెరికా కీలక మార్పులు చేయనుంది.

6.టీడీపీ యువనేత మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 147వ రోజు కోవూరు నియోజకవర్గంలో జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. లోకేశ్‌‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. 

7.ఈ వారాంతం నుండి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 

8.తమకు ముందస్తు ఆలోచన లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ముందస్తు గురించి ప్రశ్నించారు.

9.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరం కలిసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. పార్టీ పదవి అనేది బాధ్యతతో కూడుకున్నదన్నారు. 

10. వారాహి మొదటి విడత విజయవంతంగా పూర్తి అయినందున పవన్ దంపతులు తమ ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ - అనా దంపతుల ఫొటోను జనసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తద్వారా విడిపోతున్నారనే వార్తలు అసత్య ప్రచారంగా తేల్చి చెప్పారు.

11.మెటా సీఈవో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో అడుగుపెట్టారు. ఈ ఉదయం ట్విట్లర్ లోకి లాగిన్ అయ్యాడు. 

12.హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు.  48 సంవత్సరాల కోకోలి ఆత్మహత్యను లీ తోబుట్టువులు కరోల్, నాన్సీ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. 

13. దేశంలోని అష్ట దరిద్రాలకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతిని లా కమిషన్ తిరస్కరించిన తర్వాత కూడా పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావించడం సరికాదని అన్నారు. 

14. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని తినేసిన ఎలుకలు వారు జైలు పాలు కాకుండా రక్షించాయి. గంజాయిని ఎలుకలు పూర్తిగా తినేశాయని, కాబట్టి కోర్టులో చూపించలేమని పోలీసులు పేర్కొనడంతో   సాక్ష్యాలు లేని కారణంగా తమిళనాడుకు చెందిన ఇద్దరు గంజాయి నిందితులను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది.

15.తెలంగాణకు చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేసి వెళుతుంటాడని చెప్పారు.

16. ఉత్తరప్రదేశ్  లక్నోలో ఎయిరిండియా విమానం శుక్రవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుండి విశాఖపట్నం వస్తున్న ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 

17. మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో ఇటీవల గిరిజన కార్మికుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రభుత్వ అదేశాలతో అధికారులు అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు.

18.ఉత్తర ప్రదేశ్ దుద్వాన్ నేషనల్ పార్క్ లో అడవి ఏనుగులతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. తిక్కరేగిన ఏనుగులు వారి వెంట పడటంతో వారు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు.

19.దేశంలో పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సృజనాత్మక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. దేశంలో రవాణా అవసరాలకు సగటున 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందని చెప్పారు.

20.గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి, మునుగోడు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

21. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. 

22.ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్ లో రూ. 6,100 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

23.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న మూత్ర విసర్జన బాధితుడు, గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ పాదాలు కడిగి సత్కరించారు. జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. 

24. భారతీయ రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టికెట్ ధర కాస్త ఎక్కువైనా వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండడంతో వందే భారత్ లో ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 

25.తెలుగు రాష్ట్రాలతో పాటు ఏడు రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఈమేరకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజీయం ఓ తీర్మానాన్ని పాస్ చేసింది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.