స్పీడ్ న్యూస్- 4
Publish Date:Jul 4, 2023
Advertisement
31. గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాలోనూ పరిస్థితులు సజావుగా ఉన్నాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
32.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం మెుదైలంది. నాయకత్వం మార్పు, పదవుల విషయమై నేతల అసంతృప్తి, రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు ఇలా పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
33. మరోకొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.,మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటాపోటీగా ప్రకటనలు చేస్తుండటంతో.. దుబ్బాక పాలిటిక్స్ ఇప్పటినుంచే రసవత్తరంగా మారుతున్నాయి.
34.ఏడాదిన్నరగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి ముందుకొచ్చింది. 3 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీని ఐఎంఎఫ్ శుక్రవారం అందజేసింది.
35.తమిళనాడు ఏంటి.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇప్పుడు కాదులేగానీ.. మరో ఏడేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది.
36.ఎన్సీపీలో ముసలంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండుగా చీలిపోయిన ఎన్సీపీలో పోటాపోటీగా తొలగింపులు, నియామకాలు జరిగాయి.
38.ఇటీవలి కాలంలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులపై.. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఓ కాలేజీలో విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
39. మన దేశం నుంచి కూడా చాలా మంది పర్యాటకులు థాయిలాండ్ వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రోడ్డు మార్గంలో కూడా థాయిలాండ్ చేరుకోవచ్చని తెలిపింది.
40.బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/news-in-brief-39-157807.html





