స్పీడ్ న్యూస్- 3

Publish Date:Jun 29, 2023

Advertisement

21.ఉమ్మడి పౌర స్మృతికి తమ పార్టీ సూత్రప్రాయ మద్దతు తెలుపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపాకే ముందుడగు వేయాలన్నారు.

22.చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్‌లో 45 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్సై బెదిరింపులకు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినందుకు కేసులు పెట్టారు.

23.తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది.  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. 

24.రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమామలా అండగా ఉంటానని సీఎం జగన్ చెప్పుకోవడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ కుటుంబంలో కూడా జగన్ వంటి మేనమామ ఉండకూడదని అన్నారు.

25.ఆదిపురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతపరమైన అంశాలపై ఫిలింమేకర్లు సినిమాలు తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది.

26.ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచ కప్ నెగ్గిన క్షణాలను వీరేంద్ర సెహ్వాగ్ పంచుకున్నాడు. సచిన్ ను భుజాలపైకి ఎత్తుకొని మైదానంలో మొత్తం కలియదిరిగారు.

27.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.  సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ అప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.

28.ఇక నుంచి తాను పాత పద్ధతిలో మాట్లాడనని, ఇక నుంచి కొత్త పద్ధతిలో మాట్లాడతానని జన సేన అధినేత వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక నుంచి ఇలా ఇలా ఇలా అని మాట్లాడుతా ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా  కనుక్కుందాం అని వ్యాఖ్యానించారు.

29. కర్ణాటక‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకం ఆటోవాలాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు లేక, రోజంతా ఆటో తోలినా ఆశించిన డబ్బులు రాక ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు.

30. తెలంగాణ బీజేపీ నేత జితేందర్‌‌రెడ్డి చేసిన ట్వీట్‌ ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.  దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.