స్పీడ్ న్యూస్- 1

Publish Date:Jul 4, 2023

Advertisement

1. ల్యాండ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో  బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, మాజీ ముఖ్యమంత్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు  అయ్యింది. ఈ నేపథ్యంలో  తేజస్వీని వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ యాదవ్ డిమాండ్ చేశారు.  

2.ఏపీ సీఎం జగన్    ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.  ప్రధాని మోదీతో  బుధవారం భేటీ కానున్నారు.  ఈ భేటీలో రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో చర్చిస్తారు. అలాగే రాజకీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

3. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై   దాడి జరిగింది.  ఖలిస్థాన్ మద్దతుదారులు కార్యాలయానికి నిప్పు పెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. మార్చిలో ఒకసారి ఖలిస్థాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

4. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

5. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ బోగస్ ఓట్లపై తెలుగుదేశం అప్రమత్తమైంది.  అలాగే అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపైనా దృష్టి సారించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎనిమిది మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.

6.రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మంగళవారం  మార్నింగ్ వాక్‌కు వెళ్లిన  మహిళలపై‌కి వేగంగా వచ్చిన హోండా స్పోర్ట్స్ కారు  దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఒక చిన్నారి మరణించింది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.  ప్రమాదానికి అతివేగమే కారణమంటున్నారు.  

7. కరీంనగర్ జిల్లాలో నిన్న అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం  రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై   బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

8. ఉత్తరప్రదేశ్  నిన్న రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలోని ఎలక్ట్రానిక్, స్పోర్ట్సు స్టోరులో  ఈ ఘోరం జరిగింది.  అగ్నిప్రమాదానికి కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

9.తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయన  చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. స్టాలిన్ జీర్ణకోశ సంబంధిత సమస్యతో  స్టాలిన్ ఇబ్బంది పడుతున్నారు.

10.  రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కేంద్రప్రభుత్వం కట్టడి చేయకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌  హెచ్చరించారు. డీఎంకే  సర్కార్ పట్ల ప్రజాభిమానం సహించలేకే గవర్నర్ అలా చేస్తున్నారన్నారు.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.