తాజాగా అమెరికాలోని న్యూయార్క్ సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్‌లో జరిగిన ఒక సంఘటన లీగల్ సర్కిల్స్‌లో పెను సంచలనం సృష్టించింది. ఒక కేసు విచారణ సందర్భంగా లాయర్లు సమర్పించిన పత్రాలలో అసలు ఉనికిలోనే లేని ఫేక్ కోర్టు తీర్పులను, తప్పుడు ఉల్లేఖనాలను చేర్చడం కలకలం రేపింది. ఈ మోసాన్ని గమనించిన న్యాయమూర్తులు ఏకంగా కోర్టు లైవ్ స్ట్రీమింగ్ కెమెరాల ముందే లాయర్లను తీవ్రంగా మందలించారు.
ఈ వివాదానికి మూలం జుడిత్ ల్యాండ్‌బర్గ్ అనే మహిళ వేసిన సివిల్ దావా. న్యూయార్క్ నగర వీధిలో నడుస్తుండగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు వేర్ల కారణంగా ఇటుకలు పైకి లేచి ఉన్నాయి. వాటిని గమనించకుండా నడిచిన ల్యాండ్‌బర్గ్ అక్కడ తడబడి కిందపడిపోయారు. ఈ ప్రమాదానికి న్యూయార్క్ నగర యంత్రాంగమే బాధ్యత వహించాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అప్పీల్ విచారణ సందర్భంగా ఆమె తరపు లాయర్ మైఖేల్ శాండర్స్ ఫుట్‌పాత్ (Sidewalk) పరిధి మరియు చట్టపరమైన నిబంధనలను వివరిస్తూ కోర్టుకు ఒక సుదీర్ఘమైన నివేదికను సమర్పించారు. అక్కడే అసలు కథ మొదలైంది.
మే 20న జరిగిన ఈ లైవ్ విచారణలో జస్టిస్ వాలెరీ బ్రాత్‌వైట్ నెల్సన్ మరియు జస్టిస్ హెక్టర్ లాసాల్ ఈ కేసును పరిశీలించారు. వాదనలు ప్రారంభమైన 19 నిమిషాల తర్వాత న్యాయమూర్తి నెల్సన్ జోక్యం చేసుకుంటూ లాయర్లకు ఊహించని షాక్ ఇచ్చారు. ల్యాండ్‌బర్గ్ లాయర్ సమర్పించిన డాక్యుమెంట్లలో కనీసం 3 కోర్టు కేసులు పూర్తిగా కల్పితమైనవని, అవి చట్టపరమైన చరిత్రలోనే ఎక్కడా లేవని తేల్చి చెప్పారు. కేవలం ఆ మూడు కేసులే కాకుండా, వారు ఉదహరించిన మరో 10 చట్టపరమైన ఉదాహరణలు కూడా అసలు చట్టానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-york-lawyer-caught-using-ai-36-221896.html
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.