కేఆర్ఆర్ స్టోరీలో కొత్త ట్విస్ట్ ... తెర మీదకు దిగ్విజయ్ సింగ్

Publish Date:Jul 28, 2022

Advertisement

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే  కోమటి రెడీ రాజగోపాల రెడ్డి ఇంకా బీజేపీలో చేరలేదు, కానీ, చేరినట్లే అనుకోవచ్చనే స్పష్టమైన సంకేతాలు అయితే ఇచ్చారు. అంతే కాదు, ఎందుకు తాను పార్టీ మారాలని అనుకుంటున్నది కూడా అంతే స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనను ఎదిరింఛి ఓడించే శక్తి సామర్ధ్యాలు ఒక్క బీజేపీకి  మాత్రమే  ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదని స్పష్టంగా చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల గౌరవం ఉన్నా, ప్రస్తుత కేసేఆర్ ను ఎదుర్కునే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో  చేరడం, ‘చారిత్రిక అవసరం’ గా పేర్కొన్నారు. మరోవంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరుతున్నారని, మీడియా సాక్షిగా ధృవీకరించారు. ఇక ముహూర్తం ఖరారు కావడమే మిగిలుందని, అంటున్నారు. 
అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా రాజగోపాల రెడ్డిపై ఆశలు వదులుకోలేదని తెలుస్తోంది. రాజగోపాల రెడ్డి గత రెండు సంవత్సరాలుగా ఇదే చెపుతున్నా, పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు ఇప్పడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ వంటి నేతలు సమావేశమై రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేక షోకాజ్ నోటీసు ఇవ్వడమో చేస్తారని వార్తలు వచ్చాయి. ముఖ్య్మగా రేవంత్ రెడ్డి అలాంటి సంకేతాలు ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పెద్దలు తొందర వద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రాజగోపాల్ రెడ్డి పార్టీలో కొనసాగుతారని తమకు నమ్మకం ఉందని మాణిక్యం ఠాగూర్ విశ్వాసం వ్యక్త పరిచారు. 

నిజానికి, అంతకు ముందే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క వ్యక్తిగతంగా రాజగోపాల రెడ్డిని కలిసి, పార్టీ వీడద్దని కోరారు.అయినా, తన నిర్ణయంలో మార్పు లేదని  రాజగోపాల రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో, కేసీఆర్ ను ఓడించాలనే కసి కనిపించడం లేదని, అందుకే, కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈటల రాజేందర్, కాంగ్రెస్ లో కాకుండా, ఆ కసి, శక్తి సామర్ధ్యాలు ఉన్న బీజీపీలో చేరారని చెప్పు కొచ్చారు. అంటే తనది కూడా అదే బాటని రాజగోపాల రెడ్డి చెప్పు కొచ్చారు.  

ఆదలా ఉంటే కాంగ్రస్ నాయకత్వం చివరి ప్రయత్నంగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర  ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి  దించినట్లు తెలుస్తోది. దిగ్విజయ్ సింగ్‌తో కోమటిరెడ్డి సోదరులకు గతంలో మంచి సంబంధాలున్నాయని , అందుకే ఆయన్ని రంగంలోకి దించారని అంటున్నారు. త్వరలోనే ఆయన రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరపబోతున్నారని సమాచారం.  శుక్రవారం( జులై 29)ఢిల్లీలో  రాజగోపాల రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తో సమావేశం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే, రాజగోపాల రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని, అయితే, దిగ్విజయ్ సింగ్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన్ని కలిసి, తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాలని అనుకుంటున్నది,వివరంగా చెప్పేందుకు ఢిల్లీ వెళుతున్నారని కోమటి రెడ్డి క్యాంపు సమాచారం.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.