ఓలమ్మో.. దువ్వాడ సీరియల్లో కొత్త ట్విస్టు..!

Publish Date:Sep 14, 2024

Advertisement

ఏంటీ... తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ దువ్వాడ డైలీ సీరియల్ నుంచి విముక్తి లభించదా? అయిపోయినట్టే అయిపోతుంది.. మళ్ళీ స్టార్టవుతుంది. కథ కంచి వెళ్ళినట్టే వుంటుంది.. మళ్ళీ బేతాళ కథాలాగా మొదటికి వస్తుంది. ఇప్పుడు ఈ ఆయనకిద్దరు కథ మరో కొత్త ట్విస్టు తీసుకుంది. మొన్నామధ్య దువ్వాడ శ్రీనివాస్ ఒక తెలివైన పని చేశానని అనుకుంటూ, తాను వుంటున్న ఇంటిని దివ్వెల మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌కి, ఆయన భార్య దువ్వాడ వాణికి మధ్య ఇష్యూ ఆ ఇంటి వల్లే కాబట్టి, ఇప్పుడు ఆ ఇల్లు మాధురి పేరిట రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇక దువ్వాడ వాణి చేసేదేమీ లేదని, సదరు ఇంటికి వెళ్ళే అవకాశం లేదని, దాంతో ఈ వివాదం  సద్దుమణుగుతుందనే అభిప్రాయాలు వినిపించాయి. హమ్మయ్య.. సుదీర్ఘంగా సా........గుతున్న ఒక డైలీ సీరియల్ ముగిసిందన్న ఆనందం తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమైంది. రేటింగ్ తగ్గిపోయి అల్లాడుతున్న తెలుగు టీవీ సీరియళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు తమకు మళ్ళీ రేటింగ్ పెరుగుతుందని ఆనందపడ్డారు. అయితే వాళ్ళ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈ దువ్వాడ సీరియల్ కొత్త ఎపిసోడ్‌తో మళ్ళీ మొదలైంది. 

ఊహించని విధంగా దువ్వాడ వాణి తన కుమార్తెతో కలసి మళ్ళీ సదరు ఇంటికి వెళ్ళారు. కోర్టు ఆమెకు ఆ ఇంటిలోకి దువ్వాడ వాణి వెళ్ళొచ్చనే ఆదేశాలు ఇచ్చిందట. దాంతో ఆమె ఆ ఇంటి ఆవరణలోనే సెటిలయ్యారు. తలుపులు ఓపెన్ చేస్తే చాలు.. లోపలకి వెళ్ళి అన్నం కూరలు వండేసుకుని, టీవీ చూస్తూ తినడానికి ప్రిపేర్‌గా వున్నారు. ఇంటి లోపల వున్న దివ్వెల వాణి  మాత్రం ఇలాంటి డేంజర్ ఏమీ జరక్కుండా తలుపులు బిగించేశారు. ఇంటి ఆవరణలో కూర్చున్న దువ్వాడ వాణి మీడియాని పిలిపించి రచ్చ చేస్తున్నారు. ఓ యాభై మంది సబ్‌స్క్రైబర్లు వున్న యూట్యూబర్ మైకు పుచ్చుకుని వెళ్ళినా ఆమె తన  ఆవేదన వ్యక్తం చేస్తూ స్టోరీ అంతా చెబుతున్నారు. దువ్వాడ వాణి ప్రస్తుతం చెప్పేది ఏమిటంటే, ‘‘ఈ ఇల్లు నేను ఇచ్చిన డబ్బుతో కట్టించినదే. దీన్ని అమ్మడానికి దువ్వాడ శ్రీనివాస్‌కి హక్కు లేదు. దువ్వాడ శ్రీనివాస్ చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. ఈ ఇల్లు నాది. ఈ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను. అప్పటి వరకు ఈ ఇల్లు వదిలిపెట్టను. కోర్టు కూడా నేను ఈ ఇంట్లో వుండొచ్చని ఆర్డర్ ఇచ్చింది’’ అంటూ స్పష్టంగా చెబుతున్నారు. అందువల్ల తెలుగు టీవీ డైలీ సీరియళ్ళకు మరికొంతకాలం రేటింగ్‌లు వుండవని అర్థం చేసుకోవాలి మరి!

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.