కేటీఆర్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు?

Publish Date:Mar 10, 2025

Advertisement

తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణాలలో కచ్చితంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం అహంకారం, నోటి దురుసు ఒకటి. అయితే పరాజయం తరువాత కూడా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఎదుటి వారినీ, పొరుగు రాష్ట్రాలనూ చులకనగా మాట్లాడే తీరు మారలేదు. గతంలో ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే గత ఎన్నికలలో బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రతిపక్షంగా తీరు మార్చుకుని, ఓటమికి కారణాలపై సమీక్ష జరుపుకుని మళ్లీ ప్రజాభిమానాన్ని ప్రొది చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన బీఆర్ఎస్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పైనే కాకుండా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై కూడా ఇష్టారీతిగా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం చేస్తున్నాయి. అయినా ఆయన తన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా... 

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తాజా పోస్ట్ తో ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు.  ప్రీమియర్ ఎనర్జీస్ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించాలనే నిర్ణయంపై అధికార కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేందుకు ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది. సదరు పోస్టులో ఆయన వాడిన ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా (ఈవెన్ ఆంధ్రప్రదేశ్) అన్న పదంపై కేటీఆర్ పై నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు.

విషయమేంటంటే  రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్  ఇండస్ట్రియల్ పార్క్ లో  ప్రీమియర్ ఎనర్జీస్ ఏర్పాటు చేయాలనుకున్న రూ. 1,700 కోట్ల విలువైన 4 గిగావాట్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్ తయారీ ప్లాంట్   ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందనే వార్తల క్లిప్పింగ్ ను శనివారం కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలోకి  షేర్ చేస్తూ.. తెలంగాణ ఒకప్పుడు పెట్టుబడులకు అయస్కాంతంలా ఉండేది,  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు, చివరికి ఆంధ్రప్రదేశ్ ను కూడా ఎంచుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు.  ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కమిషన్ సర్కార్ లేదా ఆర్ఆర్ టాక్స్ సర్కార్ గా మారిపోయింది అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.  

ఆ పోస్టుకు కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అన్న హ్యాష్ టాగ్ ను జోడించారు. ఈ పోస్టు వెంటనే వైరల్ అయ్యింది. అదే సమయంలో ఏపీ  నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేటీఆర్ వాడిన ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అన్న మాటను నెటిజనులు తప్పుపట్టారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా కేటీఆర్ లో అహంకారం, ఏపీ పట్ల వివక్ష ఇసుమంతైనా తగ్గలేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సీఎం చంద్రబాబు పాలనలో ఉంది.. వైఎస్ జగన్ పాలనలో కాదు అంటే ఓ  నెటిజన్ కేటీఆర్ కు ఘాటు రిప్లై ఇచ్చారు. 

గతంలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో కేటీఆర్ చేసిన అహంకారపూరితమైన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దాని పర్యవశానమే.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే.. బీఆర్ఎస్ ఎప్పటికీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని దుయ్యబట్టారు. అదలా ఉంచితే కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో  బీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో నివసించే  సెటిలర్లు బీఆర్ఎస్ కు దూరం కావడం ఖాయమని అంటున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.