కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కులు

Publish Date:Dec 29, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కు మొదలైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో హస్తం పార్టీకి ఇంటా బయట చిక్కులు ఎదురవుతున్నాయా అంటే, అవునన్న సమాధానమే వస్తోంది. ఓ వంక  గాంధీ కుటుంబ విధేయుడు,  కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు  పార్టీలో దుమారం రేపుతున్నాయి.

ఇటీవల రాహుల్ గాంధీని మానవాతీతుడిగా అభివర్ణించిన సల్మాన్ ఖుర్షీద్  తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  పేరుకే అధ్యక్షుడు, పవర్స్ మాత్రం గాంధీల చేతుల్లోనే ఉన్నాయి. ఉంటాయి ..  అంటూ పార్టీ అధ్యక్షుడు, గాంధీల రిమోట్  కంట్రోల్ తో పనిచేస్తారని బీజీపే చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. నిజానికి  ఖుర్షిద్ చెప్పింది కొత్త విషయం కాదు. ఒకప్పుడు చిదంబరం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీ రోజు వారీ కార్యకలాపాలు ఖర్గే చూస్తారు. విధాన పరమైన నిర్ణయాలు, ఇతరత్రా ముఖ్య నిర్ణయాలు గాంధీలను సంప్రదించే తీసుకుంటారని అన్నారు. ఇప్పడు అదే విషయాన్ని ఖుర్షిద్,  ఖుల్లం ఖుల్లాగాబయట పెట్టారు.    కాంగ్రెస్ పార్టీ సారథి గాంధీ కుటుంబమే  అందులో సందేహం లేదు. కేవలం పార్టీ కార్యకలాపాలపైన దృష్టి సారించేందుకే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారని తెలిపారు. అయితే అది నిజమే అయినా ఇప్పడు ఖుర్షిద్ యాదృచ్చికంగా, ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనే చర్చ జరుగుతోంది. 

నిజానికి  బీజేపీ ఎప్పటి నుంచో ఇదే ఆరోపణ చేస్తోంది. ఇపుడు సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్య  ను ఆసరా చేసుకుని ఖర్గే కాంగ్రెస్ పార్టీకి రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడా? రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడా? అని ప్రశ్నించింది. ఖుర్షిద్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అసలు నిజం బయటపడిందన్నారు. భజనపరత్వం, వంశపారంపర్య రాజకీయాలనే కాంగ్రెస్ నమ్ముకుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నారనేదానితో సంబంధం లేదని పగ్గాలు మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చేతుల్లోనే ఉంటాయన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా? రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అని పిలవాలా? అని నిలదీశారు. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఎటువంటి అధికారం ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేదన్నారు. గాంధీలు ఏం చెబితే దానినే ఖర్గే చేస్తారన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికలు ఓ బూటకమని విమర్శించారు. మరో వంక మనీలాండరింగ్ కేసులో తనపై దర్యాప్తును రద్దు చేయాలని రాబర్ట్ వాద్రా చేసిన దరఖాస్తును రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ మరో మారు గాంధీ కుటుంబాని టార్గెట్ చేసింది.

భారత రాజకీయాల్లో గాంధీ కుటుంబం అత్యంత అవినీతిపరుల కుటుంబమని దుయ్య బట్టింది. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనం వీడాలని బీజేపీ డిమాండ్ చేసింది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈ అవినీతి జరిగిందన్నారు. భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం ఇది. అవినీతికి పాల్పడటం, భూములను కబ్జా చేసి రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే దాని పని. కుటుంబంలో ముగ్గురు సభ్యులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారని ఎద్దేవా చేశారు. 

అదలా ఉంటే రాహుల గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, రాహుల్ గాంధీ, విపక్షాల ముఖ్యనేతగా  ఆమోదం పొందుతున్నారని, కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్న వేళ, ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భారత్ జోడో యాత్రకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని తెగేసి చెప్పారు. అంతే కాదు, తమ పార్టీ సిద్ధాంతం, భావజాలం ప్రత్యేకమైనవన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని వ్యాఖ్యానించారు.  

మరో ఐదారు రోజుల్లో జనవరి 3 న యాత్ర ఉత్తర ప్రదేశ్ లో ప్రవేశిస్తున్నవేళ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ యాత్రలో పాల్గొనాలని బీజేపీ యేతర పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నేతలు ఇటీవల చెప్పారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్‌డీ నేత జయంత్ చౌదరిలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలోనే  అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. జోడో యాత్రలో పాల్గొనాలని తమకు ఆహ్వానమే అందలేదన్నారు. 

నిజానికి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాకపోయినా, యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తం వచ్చి చేరుతుందని, తద్వారా కాంగ్రస్ పార్టీ బలపడడంతో పాటుగా, రాహుల్  గాంధీ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని, ఆశించారు. అయితే, భారత్ జోడో యాత్ర ఈ లక్ష్యాన్ని  చేరుకుందా ? అంటే, కొంత వరకు మాత్రమే అనే సమాధానం వస్తోంది.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.