పీటల వరకే పెళ్లి.. తమిళ పొత్తులో కొత్త తిరకాసు!

Publish Date:Apr 18, 2025

Advertisement

తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజులు చెన్నైలో కూర్చుని మరీ పొత్తును పీటలెక్కించారు. స్వయంగా ఆయనే చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరంలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే’ పార్టీలు కలిసి  పోటీ చేస్తాయని ప్రకటించారు.  అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి కే. పళని స్వామి, బీజేపీ నేత అన్నామలైలతో కలిసి  మీడియా సమావేశంలో పాల్గొన్న అమిత్ షా స్వయంగా  పొత్తు ప్రకటన చేశారు. అంతే కాదు.. పొత్తుకు అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని, అలాగే బీజేపీ నుంచి కూడా షరతులు ఏవీ లేవని స్పష్టం చేశారు. డీఎంకే దుష్ట దుర్మార్గ  పాలనను అంతమొందించడమే లక్ష్యంగా  బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ఇతర పార్టీలను కలుపుకుని ఎన్డీఎ బ్యానర్ పై ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు.
అంత వరకు అంతా బాగుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు పొత్తు కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అయితే..  స్ట్రాంగర్ టుగెదర్   (‘కలిసి ఉంటే కలదు బలం’) అని ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే ఎన్డీఎ కూటమిలో చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్వాగతించారు.
నిజానికి ఎన్నికల పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు, సంప్రదింపులు జరుగతున్న నేపధ్యంలో, పొత్తు ప్రకటన పెద్దగా సంచలనం కాలేదు. అయితే  పొత్తు పారాణి ఆరక ముందే.. అన్నాడీఎంకే అధినేత పళని స్వామి  పొత్తుకు కొత్త అర్థం చెపుతూ చేసిన  ప్రకటన నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. చర్చకు దారి తీసింది.   
అవును. ఎన్నికల వరకే పొత్తంటూ పళని స్వామి పొత్తుకు కొత్త అర్థం చెప్పారు.ఎ న్నికలలో ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్నాడీఎంకే ఒప్పుకోదని స్పష్టం చేశారు. అంటే  పీటల వరకే పెళ్లి, సంసారం అంటే కుదరదు  అని పళని స్వామి మెలిక పెట్టారు. అంతే కాదు.. అమిత్ షా చెప్పింది కూడా అదే  అని వివరణ  కూడా ఇచ్చారు. అయితే  వాస్తవంలో అమిత్ షా చెప్పిన దానికి, పళని స్వామి చెప్పిన భాష్యానికి పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. అమిత్ షా చాలా  స్పష్టంగా  పొత్తుకు తమిళ పార్టీ ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. కానీ  పళని స్వామి ఇప్పడు పొత్తుకు షరతులు వర్తిస్తాయి అంటున్నారు. అంతే కాదు.. పొత్తు ఎన్నికల వరకే, ఎన్డీఎ అధికారంలోకి వచ్చినా, బీజేపీ, ఇతర మిత్ర పక్షాలకు మంత్రివర్గంలో స్థానం ఉండదని  పళని స్వామి తేల్చేశారు. 
మరో వంక రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అంతేగా ..అంతేగా అంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో వుందా అనేది ఇంకా స్పష్టం కాలేదని  పార్టీ వర్గాల సమాచారం. అయితే..  దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ నాయకత్వం,అన్నాడీఎంకే షరతులకు తాత్కాలికంగానే అయినా  ఓకే అంటుందని  అంటున్నారు.  నిజానికి  అన్నాడీఎంకే డిమాండ్ మేరకే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించిందనీ, అలాగే  పళని స్వామి తాజా డిమాండ్ ను అంగీకరించినా అంగీకరిస్తుందని అంటున్నారు.   

అయితే.. పళని స్వామి రోజుల వ్యవధిలోనే యు టర్న్ ఎందుకు తీసుకున్నారు?  ఇంతలో ఏమి జరిగింది.. అంటే, బీజేపీతో పొత్తును అన్నాడీఎంకే లో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వరం నేతల విముఖతే పళని సామి యు టర్న్ కు ప్రధాన కారణం అంటున్నారు. బీజేపీతో పొత్తు ముస్లిం ఓటును పూర్తిగా దూరం చేస్తుందని అన్నాడీఎంకే నాయకులు  పొత్తును వ్యతిరేకిస్తునట్లు తెలుస్తోంది. అలాగే.. బీజేపీతో పొత్తు కారణంగా  2021 అసెంబ్లీ 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు కూడా పొత్తు వద్దనడానికి కారణంగాచెపుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్నా  ఫలితం లేక పోయింది. అన్నాడీఎంకే సీట్ల సంఖ్య 136 నుంచి 75కి పడి పోయింది.  అధికారం అన్నాడీఎంకే చేజారింది. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తులో భాగంగా 20 సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.  అయితే  బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 33 సీట్లలో పోటీ చేసినా అన్నాడీఎంకేకి  ఆ ఒక్క సీటే దక్కింది.

అందుకే  ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తుపట్ల అన్నాడీఎంకేలో విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే, పళని స్వామి యు టర్న్ తీసుకున్నారని అంటున్నారు. 
అయితే.. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అన్నామలై నాయకత్వంలో బీజేపీ బలం మెల్ల మెల్లగా పెరుగుతోందని అంటున్నారు.  2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నా బీజేపీకి  3-4 శాతం మధ్యనే ఓట్లు పోలయ్యాయి. కానీ,  2024 లోకసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు లేకున్నా బీజేపీ ఓటు 7.58 శాతం పెరిగింది.  11 శాతానికి పైగా ఓట్లు బీజేపే  సొంత చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే బీజేపీతో మళ్ళీ పొత్తుకు సిద్దమైంది. అయితే పార్టీలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో  పళని స్వామి అటూ ఇటూ అవుతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి పళని  స్వామి  వ్యూహాత్మకంగా వెనకడుగు వేసినా.. డీఎంకేను ఎదుర్కోవాలంటే  బీజేపీ ఓటుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా అన్నాడీఎంకేకు అవసరం అవుతుందనీ,  అలాగే  బీజేపీకి కూడా దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీలో టీడీపీ, జనసేనతో ఎలాగైతే పొత్తు  అవసరమో.. అదే విధంగా  తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు అనివార్యమని అంటున్నారు.  సో .. బీజేపీ, అన్నాడీఎంకే  పొత్తు ప్రయాణంలో ఒడిదుడుకులు ఉన్నా చివరాఖరుకు పొత్తు  పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.  

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.