బస్టాండ్‌లు ఎత్తుకెళ్తున్న బాహుబలులు

Publish Date:Mar 29, 2025

Advertisement

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చాడు.. ఇవన్నీ పురణాల్లో విన్నాం.. అయితే బెంగళూరులో దొంగలు బాహుబలి అవతారమెత్తి బస్టాండ్‌లకు బస్టాండులనే ఎత్తుకుని పోతున్నారంట. సిలికాన్ సిటీ  బెంగళూరులో ఆ విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ జనాలతో  రద్దీ ఉండే ఓ బస్టాప్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. హఠాత్తుగా  ఇలాంటి విచిత్రమైన ఘటన జరగడంతో రోజూ అక్కడొచ్చి బస్సెక్కే  ప్రయాణీకులు ఆశ్చర్యపోతున్నారు. రోడ్డుపై బస్టాండ్ కనిపించకుండా  పోయిందని తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు కారణమేంటో తెలియక  భయాందోళనలతోఉక్కిరిబిక్కి రవుతున్నారు. ఎందుకంటే కేవలం ఒక్క  బస్టాప్ మాత్రమే కాదు. సిటీలో చాలాచోట్ల బస్టాండ్లు ఒకదాని తర్వాత  మరొకటి మాయమైపోతున్నాయి మరి.
చాలా ప్రాంతాల్లోలాగే బెంగళూరు  కూడా బైక్‌ దొంగతనాలు, పిక్ పాకెటింగ్, ఇళ్లలో దొంగతనాలు  సర్వసాధారణంగా జరుగుతుంటారు. కానీ, ఇప్పుడా జాబితాలోకి  బెంగళూరులోని బీఎంటీసీ బస్ స్టాప్ కూడా చేరింది. విచిత్రంగా బస్టాండ్లపై  కన్నేసారు బెంగళూరు దొంగలు. బీబీఎంపీ నిర్మించిన అనేక బస్ షెల్టర్లను  ఒకటొకటిగా లేపేస్తున్నారు. ఆ బహుబళులు. నిత్యం జనాలతో నిండి ఉండే  ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చోటు చేసుకోవడమే అందరినీ దిగ్భ్రాంతికి  గురిచేస్తోంది. ఈ వరస బస్టాప్ దొంగతనాలపై కార్పొరేషన్ చీఫ్ కమిషనర్  తుషార్ గిరినాథ్‌కు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్‌కు  ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన బస్ షెల్టర్ల విషయమై త్వరగా దర్యాప్తు  చేయాలని కోరారు.
 విజయనగరంలోని గోవిందరాజనగర్ వార్డులో అనేక బస్  స్టాప్‌లు అదృశ్యమయ్యాయి. లేఅవుట్ లోని 14వ కూడలిలో సర్వజ్ఞ స్కూల్  ముందు ఉండే బస్ షెల్టర్ కూడా మాయమైంది. ఈ బస్ షెల్టర్‌ను ఐదు  సంవత్సరాల క్రితం రూ.16 లక్షల రూపాయల ఖర్చు చేసి నిర్మించారు. నగరంలో నిర్మించిన మొట్టమొదటి హైటెక్ బస్ షెల్టర్‌గా కూడా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ స్టేషన్ గుండా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతాయి. ఎప్పుడు ప్రయాణీకులతో రద్దీగా ఈ బస్టాప్ దాదాపు నెల రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైంది. విలువైన కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్, ఇనుప వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అదేవిధంగా, ఆదిచుంచనగిరి ఆట స్థలం సమీపంలోని మరో రెండు బస్ షెల్టర్లు కూడా కనిపించకుండా పోయాయి. బస్టాండ్లు లేకపోవడంతో ప్రయాణీకులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడుతూ తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది పాపం.

By
en-us Political News

  
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.