స్టెల్త్ వేరియంట్ ప్రమాదకరమా?...

Publish Date:Mar 30, 2022

Advertisement


ఈ అంశం పై పూర్తిగా చర్చించే ముందు స్టేల్ ఒమైక్రాన్ అంటే ఏమిటో మీకు తెలుసా ?స్టేల్ వేరియంట్ లక్షణాలు ఏమిటి ? స్టేల్ వేరియంట్ ప్రభావం తీవ్రత వల్లే చైనాలో లాక్ డౌన్ పెట్టారా?కోరోనా ఒమైక్రాన్ సంక్రమించి ఇంకా పెరుగు తూనే ఉన్నాయి. చైనా లోని అతి పెద్ద నగరం లో లాక్ డౌన్ విధించారన్న వార్త ప్రపంచదేశాలలో చక్కర్లు కొడుతోంది.పెద్ద సంఖ్యలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. షాంగై లోని పుదీంగ్ జిల్లాలోని సరిహద్దులు ప్రాంతాలలో సుక్ర వారం వరకు మూసివేస్తునట్లు ప్రకటించా రని వార్త సంస్థల భోగట్ట.కోవిడ్19 పట్ల చైనా అనుసరిస్తున్న ఖటిన నిబందనల లో భాగం గా చైనా సోమవారం నుండి చైనా లోని అతి పెద్ద నగరం షాంగాయ్ ని మూసి వేయడం ప్రారంభించింది. అలా వ్యవహరించడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నలు ప్రపంచాన్ని వేదిస్తున్నాయి. చైనా దేశమంతటా 56,౦౦౦ మంది కి సంక్రమించిందని అది క్రమేణా శరవేగం గా విస్థరిస్తోందన్న వార్తలు గుప్పు మంటూ ఉండడం తో చైనా అధికారికంగా చర్యలు చేపట్టిందని ఆక్కడి వార్తా సంస్థలు వెలువరించాయి.

అయితే షాంగాయ్ లో కేవలం 47 మందికి మాత్రమే సోకడం కొంతమేర ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఇది హర్షించా దగ్గ పరిణామం గా నిపుణులు పేర్కొన్నారు.కోవిడ్19 వచ్చిన రెండు స్సంవత్సరాల మధ్య కాలం లో అతి పెద్ద ఉపద్రవం గా పెరేకొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ ఇతర జిల్లాల లోని సమీప ప్రాంతాలు శుక్ర వారం మూసివేసారు.పట్టణ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.చైనా లో జరుగుతున్న పరిణామాల వెనుక స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ ప్రభావం ఉందని అంగీకరించక తప్పదు.కోరోనా వైరస్ కు ఓమైక్రాన్ వేరియంట్ ఒక సబ్ వేరియంట్ గా నిపుణులు పేర్కొన్నారు.

స్టెల్త్ ఒమైక్రాన్ అంటే ?...

చైనా నుండి వస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు స్టేల్ వేరియంట్ ఓమిక్రాన్ ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ అంటే ఓమైక్రాన్ బి ఏ 2 క్రమం గా పెరగడం గమనించవచ్చు.ఒమైక్రాన్ బి ఏ 2 ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ గా నిపుణులు గుర్తించారు. అయితే బి ఎ2  ఒమైక్రాన్ సబ్ వేరియంట్ ను తీసుకుని పూర్తిగా పరిశోదనలు చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.బి ఎ2 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ మూల వేరియంట్ ఒమైక్రాన్ ను ప్రాధాన వేరియంట్ తో పోల్చి నప్పుడు. ఎక్కువగా సంక్రమిస్తోందని డేనిష్ పరిశోధకుల వివరాల ప్రకారం ఓమై క్రాన్ తో పోలిస్తే 1.5% రెట్లు పరివర్తన మ్యుటేట్ అవుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.

డెల్టా కన్నా స్టెల్త్ వేరియంట్ ప్రమాద కరమా?...

డెల్టా వేరియంట్ కన్నా స్టెల్త్ వేరియంట్ ఓమైక్రాన్ ప్రమాదకరమా ?  అత్యంత ప్రభావ వంత మైనదా ?అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.డెల్టా వేరియంట్ వైరస్ మాత్రమే ఇప్పటి వరకూ అత్యంత ప్రమాదకరమైనదిగా నిరూపిత మైనదని నిపుణులు పేర్కొన్నారు.డెల్టా వేరియంట్ శరీరం లోని ఊపిరి తిత్తుల పై ప్రభావం వల్ల తీవ్ర అనారోగ్యం ఇన్ఫెక్షన్ సోకి శ్వాస అందక మరణాలు చోటు చేసుకున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం డెల్టా వేరియంట్ కు భిన్నం గా ఓమై క్రాన్ దీని సబ్ వేరియంట్ ఊపిరి తిత్తులపై భాగం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణం గానే ఊపిరి తిత్తుల పై అత్యంత ప్రమాదకరమైన నిమోనియా ముక్కుకు వాసన తెలియక పోవడం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు చూడవచ్చు. స్టేల్ వేరియంట్ లక్షణాలు ఏమిటి? పైన పేర్కొన్న విధంగా ఒమైక్రాన్ లోని వేరియంట్లు ఊపిరి తిత్తుల పై భాగం పై ప్రభావం చూపుతుంది. దీనికి తోడు పొట్టలో సమస్యలు ఇలాంటి లక్షణాలు చూడవచ్చు .పొట్టలో నొప్పి, వాంతులు, తెమిలి నట్లుగా ఉండడం,గుండెల్లో మంట పొట్ట ఉబ్బరం,  అతిసారం,నలత గా ఉండడం.  నీరసంవంటి లక్షణాలు గమనించ వచ్చు.

స్టెల్త్ ఒమైక్రాన్ యొక్క ఇతర లక్షణాలు...

జ్వరం, త్వరగా అలిసిపోవడం, దగ్గు, గొంతులో గరగర, తల నొప్పి, కండరాల నొప్పులు, బలహీన పడడం, గుండె స్పందన, కొట్టుకోవడం,పెరగడం గమనించవచ్చు.ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే తప్పనిసరిగా మీరు అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రాధాన ఒమైక్రాన్ వేరియంట్ కన్నా ఇది అత్యంత ప్రమాదకరమైనదా ?మొట్ట మొదట చేసిన పరిశోదన లో తేలిన విషయం ఏమిటి అంటే స్టెల్త్ ఒమైక్రాన్ కోరోనా వైరస్ కన్నా ఇతర వేరియంట్ల కన్నా అత్యంత ప్రమాదకరం.అని తేల్చారు. మూల వేరియంట్ లేదా ప్రాధాన వేరియంట్ కన్నా అత్యంత ప్రమాదకరమైన లక్షణాలు ఆస్పత్రులలో చేరడం మరణించడం వంటివి జరగవని.అయితే ప్రాధాన వేరియంట్ లో లాగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలలో స్టేల్ వేరియంట్ ను గుర్తించడం గుర్తించడం,నిర్దారించడం పసిగట్టడం కూడా కష్టం అయితే నిపుణుల అంచనా ప్రకారం స్టేల్  ఒమైక్రాన్ వేరియంట్ మ్యుటేషన్ ఎక్కువగా ఉంటుంది. స్టేల్ వేరియంట్ ను మరింతగా పరిశీలించాల్సి ఉందని.నిపుణులు అభిప్రాయ పడ్డారు.అయితే వేరియంట్ ఏదైనా దాని తీవ్రత ఎలా ఉన్నా ఉప్పెనలా ముంచె కోవిడ్ ఉపద్రవం ముప్పు పూర్తిగా తొలగి పోలేదని అనూక్షణం అప్రమత్తం గా ఉండడం నియమ నిబందనలు పాటించాల్సిన అవసరం ఉందని అప్పుడే మనం కోరోనాను ఎదుర్కుంటూనే వాటిపై పోరాడగలం అన్నది మాత్రం నిజం.                                     

 

By
en-us Political News

  
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం.
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి.
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  
టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు.
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది.
పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం.
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ..
Insomnia, Insomnia Treatment, Sleep Problems, Sleep Disorder, Deep Sleep Tips, How to Sleep Better, Insomnia Causes,  Healthy Sleep, TeluguOne Health,
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి.
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.