తెలంగాణ ఠీవీకి దర్పణం.. కొత్త సచివాలయం

Publish Date:Apr 26, 2023

Advertisement

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబౌతోంది. ఇప్పటికే కొత్త సచివాలయంలోకి శాఖల తరలింపు షురూ అయ్యింది. బుధవారం బిఆర్కె భవన్‌ నుంచి ఆయా శాఖల ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపు ఆరంభమైంది. అంతుకుముందు సిఎస్‌ శాంతికుమారి కొత్త సచివాయానికి వెళ్లి పరిస్థితిని సవిూక్షించారు. ఆయా శాఖలకు కేటాయించిన కార్యాలయాలను పరిశీలించారు.

సచివాలయం ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా ప్రారంభం కానున్నది. ఆ రోజు నుంచే కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖలు తమకు కేటాయించిన గదులకు సామగ్రిని బుధవారం నుంచి శుక్రవారం వరకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది.   కొత్త సచివాలయంలోని ఒక్కో అంతస్తులో మూడు శాఖల కార్యాలయాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు.   ఉమ్మడి ఎపిలో  విసిరేసినట్లుగా ఉన్న సచివాలయాన్ని అదే ప్రాంతంలో కొత్తగా అధునాతనంగా నిర్మించారు.  

హుస్సేన్‌ సాగర్‌ తీరాన ధవళకాంతులతో తెలంగాణ ఠీవికి దర్పణంలా  ఈ కొత్త సచివాలయం గోచరిస్తోంది.  హిందూ, దక్కనీ, కాకతీయ శైలుల మేళవింపుతో చేపట్టిన నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి.  

సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే కళాకృతులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వేమలు ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం లో లేని విధంగా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక నిర్మాణ పద్ధతులతో భవనాన్ని నిర్మించామని వివరించారు. అత్యాధునిక హంగులతో కూడిన భవన సముదాయాన్ని నాలుగేళ్లలో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు.  రాష్ట్ర హైకోర్టు తరహాలోనే సచివాలయంపై నిర్మించిన  రెండు డోమ్‌లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేయగా, సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు అత్యంత ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్‌పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇందులో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.  వర్షపునీటిని స్టోర్‌ చేసేందుకు సంపును ఏర్పాటు చేశారు. భవనంపై పడిన ఒక్క నీటి చుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా చేసి జలసంరక్షణ ప్రాధాన్యతకు సచివాలయాన్ని మార్గదర్శిలా తీర్చిదిద్దారు. 

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.