కేసీఆర్ వర్సెస్ కేటీఆర్.. తెరాసలో కొత్త సమస్య!

Publish Date:May 18, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే ఏదో గ్యాప్ వారికి ఊపిరి సలపనీయడంలేదా? మొత్తంగా టీఆర్ఎస్ లో పైకి కనిపించని కల్లోలం అధినేతను కలవరపెడుతోందా? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది.

ఇందుకు వారు బుధవారం పట్టణ ప్రగతిపై జరిగిన సమీక్షకు మంత్రి కేటీఆర్ గైర్హాజర్ కావడమే నిదర్శనంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.   16 రోజుల పాటు పామ్ హౌస్ లో దాదాపు అజ్ణాత వాసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ఆ అజ్ణాత వాసాన్ని వీడి సోమవారం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. 18 నుంచి వరుసగా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.  మొదటిగా ప్రగతి భవన్‌లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై బుధవారం సమీక్ష నిర్వహించారు.  

ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్లు హాజరయ్యారు.  కీలకమైన ఈ సమావేశానికి సంబంధిత మంత్రి, కేసీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) గైర్హాజరయ్యారు. కేటీఆర్ గైర్హాజరీయే రాజకీయ వర్గాలలో పలు చర్చోపచర్చలకు తెరతీసింది.

కేటీఆర్ గైర్హాజరీకి ఆయన లండన్ పర్యటనలో ఉండటమే కారణమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాలలో మాత్రం భిన్న కథనాలు వినవస్తున్నాయి. ఇటీవలి కాలంలో తండ్రీ కొడుకులిద్దరూ ముఖాముఖి ఎదురు పడిన సందర్భాలు లేకపోవడం.. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు వచ్చిన తెల్లారే కేటీఆర్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లడంపై రాజకీయ వర్గాలలో పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  కేసీఆర్ ఫాం హౌస్ లో ఉన్న 16 రోజులూ కేటీఆర్ క్షణం తీరిక లేకుండా వరుస కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో బిజీగా ఉండటం, నిత్యం జనంలో ఉంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

కేసీఆర్ ప్రగతిభవన్ కు చేరుకున్న తెల్లారే విదేశీ పర్యటనకు వెళ్లడం అనుమానాలకు తావిస్తున్నదంటున్నారు.  తాను జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తానంటూ ఇటీవలి కాలంలో కేసీఆర్ తరచూ చెబుతుండడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టాలన్న ప్రణాళిక అమలులో కేసీఆర్ చేస్తున్న తాత్సరంపై తనయుడు కేటీఆర్ అసంతృప్తితో ఉన్నారనీ, అందుకే తండ్రికి ఎదురు పడడం లేదనీ అంటున్నారు. ఇటీవలి కాలంలో ఇరువురూ కలిసి ఒకే వేదిక పంచుకున్న దాఖలాలు కూడా లేవనీ కారణం ఇదే అయి ఉండొచ్చనీ అంటున్నారు. లేకపోతే కీలకమైన సమావేశానికి హాజరు కాకుండా సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి కూడా లండన్ పర్యటనకు ఎలా వెళతారని వారు ప్రశ్నిస్తున్నారు.  

మామూలుగా అయితే లండన్ పర్యటనను వాయిదా వేసుకుని ఉండేవారనీ, అలా చేయకుండా పెద్దగా ప్రాముఖ్యత లేని పర్యటనకే మొగ్గు చూపి, కీలకమైన సమీక్షా సమావేశానికి డుమ్మా కట్టడంతోనే ఏదో ఇబ్బంది, గ్యాప్ ఉందన్న విషయం స్పష్టమౌతోందని విశ్లేషణలు చేస్తున్నారు.  దాదాపు 16 రోజుల పాటు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండిపోవడం, రాష్ట్ర రాజకీయాలపై, ఆయన జాతీయ ఎజెండాపై కూడా ఒక్క మాట మాట్లాడకుండా మౌన వ్రతం పాటించడం వెనుక కారణం తనయుడితో గ్యాపేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనయుడిని బుజ్జగించేందుకే అంతకు ముందు కూడా తన దృష్టి అంతా జాతీయ రాజకీయాలపైనే అంటూ లీకులిచ్చారని చెబుతున్నారు.

ఏది ఏమైనా కేసీఆర్ ఎర్రవల్లి పాంహౌస్ నుంచి బయటకు వచ్చిన తెల్లారే కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సంకేతాన్ని ఇస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అలాగే రాజ్యసభకు తెరాస అభ్యర్థుల ఎంపిక సమయంలో కేటీఆర్ అందుబాటులో లేకపోవడం కూడా పార్టీలో ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉందనడానికి సంకేతమని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  


 

By
en-us Political News

  
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.