తెలంగాణ బీజేపీలో మరో పవర్ సెంటర్.. ఆయన దూకుడు అందుకేనా?
Publish Date:Jan 13, 2022
Advertisement
చివరకు ఏమవుతుంది..అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి అయితే, తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది . దూకుడు పెంచుతోంది. నేతల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్న నాయకులు కూడా రాష్ట్రంఓ తమ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులే కాదు, పాత కాపులు కూడా రాష్ట్రంలో కర్చీఫ్ వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు కొంచెం చాలా దూరంగా ఉన్న, పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ ధర రావు, హటాత్తుగా తెర మీదకు వచ్చారు. అంతే కాదు, ఓ వంక అధికార తెరాసను, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను తూర్పారబడుతూనే మరోవంక కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడుతున్నారు. అలాగే, ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననీ ప్రకటించారు. నిజానికి ఇప్పటికే, రాష్ట్ర బీజేపీలో నాయకుల తాకిడి ఎక్కువగా వుంది. ముందునుంచి పార్టీలో ఉన్నవారికంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల సందడే పార్టీలో ఎక్కువుగా కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు ., బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, ఇంద్రసేనా రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఇలా చాలా మంది మాజీలు ..ఇప్పుడు కారణాలు వేరైనా రాష్ట్ర రాజకీయాలలో అంత చురుకైన పాత్రను పోషించడం లేదు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఆంటీ ముట్టనట్లే ఉంటున్నారు. అయితే, కిషన్ రెడ్డిని పార్టీ అధిష్టానమే కట్టడి చేస్తోందని, అదే విధంగా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించేందుకు పాత కాపుల పాత్రను బ్యాక్ సీట్ కు పరిమితం చేస్తోందని, పార్టీ వర్గాల సమాచారం. అదలా ఉంటే, పార్టీ రాష్ట్ర ఆధాయక్షుడు బండి సంజయ్ అరెస్ట్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మురళీధరరావు, ఇలా ఒక్కసారిగా దూకుడు పెంచడం వెనక రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించి, ఎన్నికల రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలనే అలోచన ఒకటి అయితే కావచ్చును,కానీ అసలు కారణం వేరరే ఉందని అంటున్నారు. మురళీధర రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే ఏ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం యాదృచ్ఛికమే అయినా, ఆ కారణంగా అయినా పక్క చూపులు చూస్తున్నారనే ఆరోపణలు వినవస్తన్నాయి. ఇటీవల బండి సంజయ అరెస్ట్ వ్యవహారంలో కేంద్ర నాయకత్వం కదిలి వచ్చినా మురళీధర రావు మాత్రం ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు, ఆ విమర్శలను తుడిచేసుకునేందుకే ఆయన దూకుడు పెంచారని అంటున్నారు.అందుకే ఆయన ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ను అవినీతిని కక్కించి జైలుకు పంపడం ఖాయమన్నారు. అవినీతి చేసినవారు ఎంతటివారైనా జైలు వెళ్లాల్సిందేనని గట్టిగా హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని జోస్యం చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు అంతర్గత కుమ్ములాటలో కాంగ్రెస్ పార్టీ తమకు పోటీయే కాదన్నారు జాతీయ అధ్యక్షుడని కూడా నియమించుకునే పరిస్థితిలో లేని కాంగ్రెస్ బీజేపీకి పోటీనే కాదని అన్నారు అంతర్గత కుమ్ములాటలో వారి సమస్యలు తీర్చుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఇక ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పంచాయితీలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆపార్టీ నేతలు అమోమయంలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. అయితే, రాష్ట్ర రాజకీయాలలో మరో పవర్ సెంటర్ కావాలనే మురళీధర రావు ఆలోచనలు ఫలిస్తాయా, అనేది చూడవలసి వుందని ప్రస్తుతానికి అయితే కేంద్ర నాయకత్వం అయన మీద ఒక నజర్ వేసి ఉంచిందని అంటున్నారు
http://www.teluguone.com/news/content/new-power-centre-in-bjp-39-130155.html





