ఖమ్మంలో కేసీఆర్ కు కొత్త తలనొప్పులు!

Publish Date:Aug 6, 2023

Advertisement

తెలంగాణ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లా రాజ‌కీయంగా పెద్ద త‌ల‌నొప్పిగా మారుతూ వ‌స్తోంది. గ‌త రెండు ద‌ఫాలుగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చినా  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మాత్రం చ‌తికిల‌బ‌డింది. ఎన్నిక‌ల త‌రువాత ఇత‌ర పార్టీల్లో గెలిచిన వారిని పార్టీలో చేర్చుకోవ‌టం ఆ పార్టీకి ప‌రిపాటిగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ల‌గం వెంక‌టరావు, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పువ్వాడ అజ‌య్ కుమార్‌లు మాత్ర‌మే బీఆర్ఎస్ నుంచి విజ‌యం సాధించారు. అయితే, మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో స‌త్తాచాటాల‌ని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈసారి ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా  వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సైతం ఈసారి జిల్లాపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో జిల్లాలో గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల అనుభ‌వంతో పాటు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని జిల్లాలో భారీ మార్పులు చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మ‌డి జిల్లాలో పొంగులేటికి మంచి ప‌ట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన నాటినుంచి పొంగులేటి సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకుంటామ‌ని, అధికార పార్టీకి ఒక్క స్థానాన్ని ద‌క్క‌నివ్వ‌మ‌ని స‌వాల్ చేశారు. ఈ మేర‌కు మ‌ధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ  సీనియ‌ర్‌నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క‌తో క‌లిసి పొంగులేటి ముందుకెళ్తున్నారు. పొంగులేటి వ్యూహాల‌కు చెక్‌ పెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేద‌ని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ప‌లు ద‌ఫాలుగా నిర్వ‌హించిన స‌ర్వేల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్‌దే ఆధిప‌త్యం అని తేలిందని చెబుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో కీల‌క‌ నిర్ణ‌యాలు తీసుకోబుతున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు జ‌న‌ర‌ల్ నియోజ‌క వ‌ర్గాలు ఉన్నాయి. వీటిల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. 

మూడు జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పువ్వాడ అజ‌య్ కుమార్ ఉన్నారు. ప్ర‌స్తుతం అజ‌య్ మంత్రిగా కొన‌సాగుతున్నారు. . మ‌రోసారి ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పువ్వాడ అజ‌య్ కుమార్ బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పాలేరు, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల‌పై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిసారించారట. పాలేరు నియోజ‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌రువాత కొద్దికాలానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజ‌యం సాధించిన కందాల ఉపేంద‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల మ‌రోసారి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు. దీంతో కందాల‌, తుమ్మ‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది.  ఈసారి పాలేరు నుంచి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఆమె ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్యాల‌యాన్నిసైతం ప్రారంభించారు. ఈ క్రమంలో పాలేరులో ష‌ర్మిల బ‌రిలో నిలిస్తే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గం సీఎం కేసీఆర్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిందంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోదిగిన వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు బీఆర్‌ఎస్ అభ్య‌ర్థి జ‌ల‌గం వెంక‌ట్రావ్‌పై విజ‌యం సాధించారు. ఆ త‌రువాత ఆయ‌న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఎన్నికల సమయంలో వనమా  సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు హైకోర్టులో కేసు వేయడంతో విచారణ చేపట్టిన కోర్టు ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని తీర్పి ఇచ్చింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈసారి కొత్త‌గూడెం నుంచి ఇద్దరిలో ఎవరిని బరిలోకి దింపుతారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మ‌రోవైపు డీహెచ్ గ‌డ‌ల శ్రీ‌నివాస్‌రావు ఈసారి ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారంటున్నారు. కొత్త‌గూడెం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.  అయితే ఈ ముగ్గురిని కాద‌ని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్  యోచిస్గున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.   

కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు. పొంగులేటిని దీటుగా ఎదుర్కోవాలంటే తుమ్మ‌ల వ‌ల్లనే సాధ్య‌మ‌వుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.     తుమ్మ‌లను కొత్త‌గూడెం నుంచి బ‌రిలోకి దింప‌డం ద్వారా పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి చెక్ పెట్టొచ్చ‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, తుమ్మ‌ల మాత్రం పాలేరు నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి జిల్లాలో ఘోర ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హ‌వాను త‌ట్టుకొని ఏ మేర‌కు నిల‌బ‌డుతుందో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.