ఉత్తరాంధ్ర, ఢిల్లీ ఇక సుబ్బారెడ్డిదే! విజయసాయి సర్ధేసుకున్నట్లేనా?!

Publish Date:Aug 6, 2023

Advertisement

టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే లోకేష్ పేరు సహజంగానే వినిపిస్తుంది. అదే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం ఎవరిది అంటే ఠక్కున ఒక పేరు చెప్పడం ఇప్పుడు కష్టమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, పాదయాత్ర సమయంలోనూ, జైలుకెళ్లినప్పుడూ జగన్ వెంట ఉన్న తల్లీ, సోదరి ఇప్పుడు దూరమయ్యారు.ఇక జగన్ సతీమణి భారతి ఇప్పటి వరకూ బయటకి వచ్చింది లేదు. ఇక కుటుంబం కాకుండా పార్టీలో జగన్ తర్వాత ప్రాముఖ్యత గల నేతలు ఎవరంటే మొన్నటి వరకూ విజయసాయి రెడ్డి పేరు గట్టిగా వినిపించేంది. ఆ మాటకొస్తే జగన్‌ పార్టీ స్థాపించక ముందు నుంచే విజయసాయి రెడ్డి ఆయనతో కలిసి ప్రయాణించారు. జగన్ కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి కూడా కొన్ని నెలలు జైలులో గడిపారు. 

ఆ కేసులలో ఏ 1 జగన్ రెడ్డి అయితే ఏ 2 విజయసాయిరెడ్డే. అందుకే జగన్‌ దగ్గరికి వెళ్లలేనివారు విజయసాయిరెడ్డి వద్ద తమ సమస్యలు చెప్పుకునేవారని వైసీపీ వర్గాలే చెబుతాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ ఎలాగో జగన్ కు విజయసాయి అలాగ అని గతంలో గట్టిగా వినిపించేది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో   విజయసాయి రెడ్డి కీలక భూమిక పోషించారనే సంగతి తలిసిందే. ఐ ప్యాక్‌తో కోఆర్డినేషన్ విషయంలో కూడా అప్పట్లో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర అని చెబుతారు. ఈ క్రమంలోనే ఇటు జగన్ తో వ్యాపార సంబంధాలతో పాటు జాతీయ స్థాయిలో వైసీపీకి సంబంధించిన అన్ని అంశాలను విజయసాయి రెడ్డి దిగ్విజయంగా చూసుకొనే వారు. విజయసాయి రెడ్డి ఢిల్లీ వ్యవహారాలలో పర్ఫెమెన్స్ చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం తెర మీదకి తెచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర వ్యవహారాలను కూడా ఆయనకే అప్పగించారు.

అయితే అదంతా గతం. ఇప్పుడు జగన్ - విజయసాయి మధ్య సఖ్యత లేదనే ప్రచారం గట్టిగా జరుగుతున్నది. ఢిల్లీ వ్యవహారాలలో ఈ ఇద్దరి మధ్య ఎక్కడో తేడాలు వచ్చాయని, అందుకే విజయసాయిని జగన్ దూరంగా పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయసాయిరెడ్డిని దూరం పెట్టిన జగన్.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో.. వైవీ సుబ్బారెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించారు. ఆ సమయంలో కనీసం ఓటింగ్‍కు కూడా విజయసాయి హాజరు కాలేదు. ఇక గడప గడపకూ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన వర్క్ షాపులో కూడా జగన్.. అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇన్ చార్జి, అనుబంధ విభాగాల సమన్వయకర్త ఇలా అన్ని బాధ్యతలు పోయి.. ఒక్క రాజ్యసభ మాత్రమే విజయగాయి మిగిలారు.   కాగా, ఇప్పుడు అధికారికంగానే ఢిల్లీ వ్యవహారాలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు జగన్ సన్నిహిత వర్గాల సమాచారం.

గతంలో విజయసాయి చూసిన ఢిల్లీ వ్యవహారాలన్నీ ఇకపై అధికారికంగా సుబ్బారెడ్డి చూడనున్నారని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా ఉన్న సుబ్బారెడ్డికి మరికొన్ని అనుబంధ విభాగాలను కూడా అప్పగించనున్నారని చెబుతున్నారు. తిరుమల తిరుపతి చైర్మన్ పదవి గడువు ముగుస్తుండటంతో  ఇకపై జగన్ తన బాబాయ్ సుబ్బారెడ్డిని పూర్తిగా రాజకీయ కార్యకలాపాలలోకి దించే యోచనలో  ఉన్నారనీ,  అందుకు తగ్గట్లే ఇటు ఉత్తరాంధ్ర, అటు ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టే పనిని అప్పగించనున్నారనీ చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీలో ఇక విజయసాయి శకం ముగిసినట్లే భావించాల్సి వస్తుంది. పార్టీలో నంబర్ 2 అనే స్థాయిలో చక్రం తిప్పిన విజయసాయి ఇప్పుడు కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాగా.. రేపు ఆ పదవీ కాలం పూర్తయ్యాక అది కూడా కొనసాగిస్తారా లేక సాయన్నముసలోడైపోయారని పక్కన పెడతారో చేడాలి.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.