తెలంగాణకు కొత్త గవర్నర్ ?

Publish Date:Jan 9, 2023

Advertisement

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి ఇంచు మించుగా మూడున్నరేళ్లు పూర్తయ్యాయి. 2019 సెప్టెంబర్ లో ఆమె తెలంగాణ గవర్నర్  గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్  నుంచి  బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ఆమె పదవీ కాలం ముగిసేందుకు ఏడాదిన్నరకు పైగానే సమయముంది. అయితే త్వరలోనే  ఆమె స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ప్రస్తుతం తమిళి సై తెలంగాణ గవర్నర్ బాధ్యతలతో పాటుగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్  బాధ్యతలు పూర్తి స్థాయిలో ఆమెకు అప్పగించి, తెలంగాణకు కొత్త వారిని గవర్నర్  గా నియమించే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రి  అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెల్సుస్తోంది. 

అయితే  గవర్నర్ మార్పునకు, ఇదీ కారణం అని స్పష్టంగా తెలియక పోయినా ఇటీవల కాలంలో గవర్నర్ కు ముఖ్యమంత్రికి, రాజ్ భవన్ , ప్రగతి భవన్ (ముఖ్యమంత్రి నివాసం )కు మధ్య దూరం పెరిగిపోవడం, రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదాలు తలెత్తడం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఒక కారణం అయితే  కావచ్చును కానీ, అదే ప్రధాన కారణం అయితే కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలకు సంబంధించి గవర్నర్ తమిళి సై పలు మార్లు కేంద్ర హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతగల మంత్రులు ఇతర అధికారులు మీడియా ముఖంగా లేవనెత్తిన అంశాలను పరిశీలించిన మీదట  కేంద్ర హోం శాఖ అధికారులు, తెలంగాణకు రాజకీయ నాయకుల కంటే రిటైర్డ్  సివిల్ సర్వెంట్స్ గవర్నర్ గా నియమించడం అవసరమని నిర్ణయానికి వచ్చారని, అందుకే తమిళి సై స్థానంలో  రిటైర్డ్ సివిల్ సర్వెంట్  ను నియమించేందుకు వీలుగా ఆమెను పుదుచ్చేరికి పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో తెలంగాణ ఆందోళన ఉదృతంగా ఉన్న రోజుల్లో (2010)లో ఉమ్మడి రాష్త్రం గవర్నర్ గా వచ్చిన మాజీ ఐపీఎస్ ఈఎస్ఎల్ నరసింహన్  రాష్ట్ర విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్  గా వరసగా 9 ఏళ్ళు కొనసాగడమే కాకుండా విభజన వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్న రోజుల్లో గవర్నర్, ముఖ్యమత్రి మధ్య సత్సంబంధాలు ఉండేవి ముఖ్యమంత్రి కేసీఆర్  రాజ్ భవన్   కు వెళ్లి గవర్నర్ తో అన్ని విషయాలు చర్చంచి, సలహాలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలోనూ ఇద్దరి మధ్య గౌరవప్రదమైన సంబంధాలే చివరి వరకు కొనసాగాయి. ముఖ్యమంత్రి గవర్నర్ దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆశీస్సులు అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పండగలు పబ్బాలకు శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

ఈ అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, ఉత్తరది రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించే అలోచనలో కేంద్ర హోం శాఖ ఉందని అంటున్నారు. అయితే, ఇప్పటికే గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మాజీ సివిల్ సర్వెంట్ ను నియమిస్తారా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా,అనేది ఇంకా తెలియవలసి వుంది. అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న గవర్నర్ మార్పు నిర్ణయం రాజకీయంగానూ చర్చనీయాంశం మవుతోందని అంటున్నారు. ముఖ్యంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారాసల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ మార్పుకు . రాజకీయ ప్రాముఖ్యతను కూడా కాదన లేమని అంటున్నారు.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.