ఏడుకొండల పైన కొత్తా దేముడు.. ఎవరో తెలుసా?

Publish Date:Apr 27, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ వ్యతిరేకి అయినా కాకున్నా, హిందువు అయితే కాదు.  ఇది జగమెరిగిన సత్యం. ఆయన కుటుంబ చరిత్రే అందుకు సాక్ష్యం. అయితే ఆయన దేవుని పాలనలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి అనేందుకు సందేహించవలసిన అవసరం లేదు  అని హిందూ ధార్మిక సంస్థలు, స్వాములు, స్వామీజీలు ఎప్పటినుంచో చెపుతున్న మాట చేస్తున్న ఆరోపణ.

ఒక విధంగా హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న   ధర్మాగ్రహం. ఇప్పుడు, ఆ ధర్మాగ్రహ వాణిలో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీ  సైతం గొంతు కలిపారు.  సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై స్వామీజీ ఆగ్రహం వ్య్తక్తం చేశారు. నాజీవితంలో ఇలాంటి చందనోత్సవాన్ని చూడలేదన్నారు. సంప్రదాయాన్ని మంట గలిపేసారని స్వామిజీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. 
నిజానికి స్వామీజీ ఇప్పుడే ఆగ్రహం వ్యక్తపరిచినా, జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటన ఇదొకటే కాదు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. వింటూనే ఉన్నాం.

వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న  నిర్ణయాల వరకు టీటీడీ  అపచారాలకు లెక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని భక్తులు, హిందూ ధర్మ సంస్థలు ఎన్నో మార్లు ఆరోపించాయి. ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
అంతే కాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులు పదే పదే వ్యక్తపరుస్తూనే ఉన్నారు.

ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో టీటీడీ దోపిడీకి పాల్పడుతోందని, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా  అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది,  దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు.
నిజానికి, ఒక్క ఏడు కొండలవాడి విషయంలోనే కాదు అప్పన్న దేవుని విషయంలోనూ అపచారాలకు కొదవలేదని అంటున్నారు. సింహాచలం చందనోత్సవంలో భక్తులకు సరైన సదుపాయలు కల్పించక పోవడం, అందుకు సంబదించి శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకెత్తు అయితే, ఇక్కడా ఆగమ శాస్త్ర ఉల్లంఘన జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

అప్పన దేవుని నిజరూప దర్శనం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆగమ శాస్త్రానుసారం స్వయంభూ మూర్తుల వీడియో, ఫొటో తీయకూడదు. అయితే  గత సంవత్సరం ఆ తప్పు జరిగింది. అదే తప్పు ఈ సంవత్సరం మళ్ళీ జరిగింది. గత ఏడాది ఘటనపై దేవస్థానం అధికారులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రకటించినా దర్యాప్తు జరిగిన దాఖలాలు లేవు. ఈ అలసత్వం వల్లే ఈ ఏడాది కూడా అదే అపచారం పునరావృతమైందని దేవస్థానంలో చర్చ జరుగుతోంది.

ఇదంతా ఒకెత్తు అయితే, గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక పరుస్తున్నారు. వెంకన్న  స్వామి మీద భక్తి విశ్వాసాలతో కొండెక్కిన భక్తులకు కొత్తా దేవుడు (మా నమ్మకం నువ్వే జగనన్న) స్టిక్కర్లు దర్శనం  ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవుని పట్ల అపరాధం మాత్రమే కాదు, చట్టరీత్యా నేరమని అంటున్నారు. రాజకీయ పార్టీల జెండాలు, నినాదాలు రాసున్న స్టిక్కర్లు, చివరకు రాజకీయ పార్టీల గుర్తులున్నచేతి సంచీలు, రాజకీయ ప్రచార సామాగ్రి ఏదీ కొండమీదకు తీసుకురరాదని, టీటీడీ నియమాలే ఘోషిస్తున్నాయి. అందుకే ఇంతవరకు ఎన్నికల సమయంలోనూ తిరుమల కొండలపై ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీ గుర్తులతో ప్రచారం చేసిన సందర్భం లేదు. కానీ ఇప్పడు ఏకంగా  మా నమ్మకం నువ్వే జగనన్న  స్టిక్కర్లు అంటిస్తున్నారు. అయినా టీటీడీ అధికారులు, పోలీసులు, విజిలెన్స్అధికారుల ఎవరూ పట్టించుకోవడం లేదు.ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు.

మరో వంక ఇది ఇలాగే సాగితే రేపు మాడ వీధుల్లో, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట ఇలా ఎక్కడంటే అక్కడ రాజకీయ జెండాలు, నినాదాలు దర్శననమిస్తాయని హిందూ ధార్మిక సంస్థలు అంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యమత వ్యాప్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారని హిందూ ధార్మిక సంస్థలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకురుస్తోందని,ఇప్పటికైనా ప్రభుత్వం, టీటీడీ కళ్ళు తెరవక పోతే, వైసీపీని ఏ దేవుడు రక్షించలేరని ... భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.