కొండలపై కొలువైతే దేవుడైపోయినట్లేనా? రిషికొండ బాగోతం అందుకేనా?

Publish Date:Aug 19, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  హిందూ ధర్మ వ్యతిరేకి  అవునా కాదా తెలియదు కానీ ఆయన హిందువు అయితే కాదు.  ఇది జగన ఒక్కరే కాదు జగమెరిగిన సత్యం. భారత దేశం కుల మతాలకు అతీతమైన లౌకిక రాజ్యం అందులో ఎటువంటి సందేహం లేదు. సర్వ మత సామరస్యం, సౌభ్రాతృత్వం భారత డీఎన్ఏలోనే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు దేశం నిలువెత్తు నిదర్శనం.  అయితే ఏపీ విషయంలో  మాత్రం జగన్ హయాంలో ఒక కొత్తా దేముడు అవతరించాడు.  ఈ విషయాన్ని ఆయన కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు.  

విశాఖ రిషికొండపై నిర్మాణాల విషయంలో వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందిస్తూ.. మంత్రి రోజా, మాజీ మంత్రులు  తిరుమల కొండపై వెంకన్న దేవుడు కొలువై ఉండలేదా?  శ్రీశైలం కొండపై బ్రమరాంబికా సమేత మల్లికార్జునుడు కొలువుదీరలేదా? అంటూ కొత్త వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అలాగే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్  వంటి కొండలపై నివాసాలు వెలిశాయి కదా అని  ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని నివాసాలు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మితమై ఉంటే.. ఆ విషయాన్ని కోర్టుల్లో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిషికొండపై నిర్మాణాలు కూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని జాతీయ హరిత ట్రైబ్యునల్ కుండ బద్దలు కొట్టింది. అయినా వాటిని వేటినీ పట్టించుకోకుండా రిషికొండకు గుండు కొట్టి మరీ జగన్ సర్కార్ నిర్మాణాలను కొనసాగిస్తోంది? అదేమిటంటే.. దేవుళ్ల ఆవాసాలను ప్రస్తావిస్తున్నారు

వైసీపీ నేతలు. ఎవరి నాయకుడు వారికి దేవుడితో సమానమైతే అవ్వోచ్చు కానీ, తామనుకుంటున్నదే సర్వ జనులూ అనుకుని తారాలంటూ మాట్లాడటమే అతిగా అనిపిస్తోంది. అయినా జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హిందూ ఆలయాలు, దేవుళ్లే లక్ష్యంగా జరిగిన దాడులను కాకతాళీయంగా భావించలేని పరిస్థితిని ఆయన, ఆయన పార్టీ నేతలే స్వయంగా కల్పిస్తున్నారు. హిందువులంతా కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సాగుతున్న చర్యలపై హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని జగన్ సర్కార్ అసలు కన్సిడర్ చేయడం లేదు. ఒకటనేమిటి.. సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకలు, జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో తెలియంది కాదు. 

వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం,  టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న  నిర్ణయాల హిందూ మత విశ్వాసాలకు విరుద్ధంగానే ఉన్నాయి.  హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తిరుమలను టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో వ్యక్తమౌతోంది. అన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వెంకన్న దేవుడిని నల్ల రాయిగా అభివర్ణించిన కరుణాకరరెడ్డిని నియమించడంతో రాష్ట్రంలో కొత్తా దేముడవతరించాని వైసీపీ ప్రచారం చేసుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.