అదిరింది సారూ కేసీఆరూ.. కొత్త పార్టీ.. కోత్త ఫ్లైటు!

Publish Date:Sep 30, 2022

Advertisement

కొత్త ఇల్లు  కొత్త.. అంటూ  అదేదో సినిమాలో ఓ డైలాగుంటుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితీ అలాగే ఉంది. అదిరింది సారూ..కేసీఆరూ..  కొత్త ఫ్లైటూ, కొత్త పార్టీ అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెరాస అధినేతగా, తెలంగాణ సీఎంగానే కాదు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదామని ఉవ్విళ్లూరుతున్న నేతగా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు.

ఆయన ప్రతి అడుగూ వ్యూహాత్మకమే, ప్రతి మాటా ఒక రాజకీయ ఎత్తుగడే అన్నట్లుగా ఉంటుంది. కేసీఆర్ మాట్లాడినా సంచలనమే.. మౌనం వహించినా సంచలనమే అన్నట్లుంటుంది ఆయన వ్యవహార శైలి. ఎనిమిదేళ్లుగా తెలంగాణ సీఎంగా ఉన్న ఆయన.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఇక తనకు తిరుగులేదని అనుకున్నారో ఏమో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా రాష్ట్రంపై కంటే జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఆయన చాలా రాష్ట్రాలు తిరిగేశారు.

చాలా మంది నేతలతో భేటీ అయ్యారు. అవేమీ పెద్దగా కలిసి రాకపోయినా.. ఆయన తగ్గేదేలే.. అంటూ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నం, ప్రతి చర్యా ఒక సంచలనమే అన్నట్లుగా సాగుతోంది. తన జాతీయ రాజకీయ ప్రవేశంలో భాగంగా దేశ వ్యాప్తంగా చేసే పర్యటనల కోసం.. అవును కేవలం ఆయన పర్యటనల కోసమే రూ.80 కోట్లతో సొంత చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటి వరకూ దేశంలో  ఏ రాజకీయ నాయకుడూ చేయని సాహసం ఇది అనే చెప్పాలి.

ఆ విమానం కొనుగోలు ఖర్చును ఐదారుగురు పార్టీ నేతలు భరించారని చెబుతున్నారు. దేశ ప్రధాని కూడా గతంలో అంటే 2014 ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక విమానంలో సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే అదేమీ పార్టీ ఆయన కోసం కొన్న విమానం కాదు. కానీ ఆయన సన్నిహితుడిగా పేరొందిన పారిశ్రామిక వేత్త సమకూర్చిన విమానం అది.  అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ జాతీయ రాజకీయ ప్రవేశం బీజేపీ ఏకగ్రీవ తీర్మానంతో జరిగింది. మరి కేసీఆర్ విషయంలో అలాంటిదేమీ లేదు.

ఎందుకంటే ఇప్పటి కింకా ఆయన ప్రాంతీయ పార్టీ అధినేతే.. అందుకే ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశించి చక్రం తిప్పాలనుకుంటే అందుకు ఎవరి అనుమతులూ, ఏ పార్టీ తీర్మానం అవసరం లేదు. ఆయన నిర్ణయమే తెరాస నిర్ణయం. ఎందుకంటే ఆయనే తెరాస, తెరాసయే ఆయన. అది పక్కన పెడితే కేసీఆర్  గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ దేశ ప్రధాని అయినప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న తానెందుకు కాకూడదనుకున్నారో ఏమో .. ప్రధాని పీఠం లక్ష్యంగా గురిపెట్టు జాతీయ రాజకీయాలలోకి అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం ఏకంగా కొత్త పార్టీనే స్థాపిస్తున్నారు. అందుకు ముహూర్తం ఖరారు చేసేశారు. దసరా రోజున ఆయన తన జాతీయ పార్టీని ప్రకటిస్తారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.  

ఆ ప్రకటన తరువాత ఇక కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు ఉంటాయి. బాడుగ విమానాలు తన స్థాయికి సరిపోవనుకున్నారో ఏమో సొంతంగా విమానాన్ని కొనుగోలు చేసేయాలని నిర్ణయించారు. మోడీకి అదానీలా.. కేసీఆర్ కోసం విమానాలు సమకూర్చి పెట్టేందుకు బోలెడు మంది సదా సిద్ధంగా ఉంటారు. అయినా ఎందుకో కేసీఆర్ ఆ దిశగా ఆలోచించేందుకు ఇష్టపడలేదు.  పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత పేరు బయటకు వచ్చిన తరువాత.. అలాగే సొంత మనిషి అనుకున్న ఎంపీ సంతోష్ కూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత మరెవరినీ దగ్గరకు తీయద్దు అనుకున్నారో ఏమో..  వాళ్లూ వీళ్లూ విమానాన్ని సమకూర్చి పెట్టేదేమిటి? సొంతంగా విమానాన్ని కొనేస్తే పోలా అని నిర్ణయించుకున్నారు.  

అందుకే బాగుంది సారూ.. కేసీఆరూ అని అందరూ అనేలా కొత్త పార్టీ , కొత్త విమానంతో ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్న మాట. విజయదశమి రోజునే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేస్తారు. చెడుపై మంచి గెలిచిన రోజు విజయదశమిగా ప్రతీతి. అటువంటి విజయదశమిని కేసీఆర్ తన కొత్త పార్టీ పేరు ప్రకటనకు ఎంచుకున్నారు. గత కొంత కాలంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన ఆయన ఆ యుద్ధం ఆరంభానికి విజయదశమిని ఎన్నుకున్నారని తెరాస వర్గాలు ఘనంగా చెబుతున్నాయి.

కేసీఆర్ కు దైవ భక్తి మెండు. అందుకే ఆయన జాతీయ పార్టీ ప్రకటనకు ముందు శుక్రవారం (సెప్టెంబర్ 30) యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. పనిలో పనిగా గతంలో ప్రకటించిన విధంగా కేజీ 16 తులాల బంగారాన్ని స్వామివారికి సమర్పించి తన పసిడి మొక్కు తీర్చుకున్నారు. అలాగే తన కొత్త జాతీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం  తీసుకున్నారు.  అలాగే శనివారం (అక్టోబర్1 ) వరంగల్   భద్రకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు. విజయదశమి రోజున పార్టీని ప్రకటించి కొత్త పార్టీ తరఫున తొలి బహిరంగ సభ కరీంనగర్ లో నిర్వహించనున్నారు. మొత్తం మీద కేసీఆర్ కొత్త పార్టీ లాంచింగ్ ను ఘనంగా, చాలా ఘనంగా చేయనున్నారు.  

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.