Publish Date:Oct 16, 2024
బీజేపీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైందా అంటే ఆ పార్టీ సీనియర్ల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో అనుకున్న ఫలితాలు సాధించడంలో విఫలమైన నాటి నుంచీ బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి నడ్డాను తప్పించాలన్న చర్చ మొదలైంది. పనిలో పనిగా జాతీయ అధ్యక్షుడితో పాటుగా పార్టీ పదవులలో కూడా సమూల మార్పులు చేయాలని హైకమాండ్ భావిస్తోంది.
ముచ్చటగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరినా, అనుకున్న స్థాయిలో స్థానాలను గెలుచు కోవడంలో బీజేపీ వైఫల్యం నడ్డా మెడకు చుట్టుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే అంటే 2025 జన వరి లేదా ఫిబ్రవరిలో పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టు అవకాశాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల పట్ల తీవ్ర నిరుత్సాహంతో ఉన్న బీజేపీ హైకమాండ్.. నడ్డా మెతకతనం వల్లే ఫలితాలు అనుకున్న విధంగా రాలేదని భావిస్తున్నది. అందుకు పార్టీని ముందుండి నడిపించగలిగిన బలమైన నేత కోసం గాలిస్తోంది.
వాస్తవానికి బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం గత జూన్ తోనే ముగిసింది. అయితే మోడీ, షాలకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నడ్డా స్థానంలో మరొకరిని తీసుకువచ్చే యోచన బీజేపీ హైకమాండ్ చేయలేదు. అందుకే బీజేపీ మూల సిద్ధాంతానికి విరుద్ధమే అయినా నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా జోడు పదవులలో కొనసాగిస్తూ వచ్చింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత, తాజాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఇక నడ్డాకు ఉద్వాసన పలకక తప్పదన్న నిర్ణయానికి కమలం పెద్దలు వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టగలిగే నేత ఎవరన్న దానిపై అధిష్ఠానంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. పరిశీలనలో మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్, అలాగే రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత వసుంధరా రాజెపేర్లు ప్రముఖంగా వినిపి స్తున్నాయి. అయితే వీరంతా కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన నేతలు కావడంతో మోడీ, షాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ అయితే నితిన్ గడ్కరీని సిఫారసు చేస్తోందని అంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల నాటికి ఎవరి పేరు ఖరారౌతుందన్నది వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-face-in-place-of-nadda-39-186901.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.