Publish Date:Apr 29, 2026
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పని చేయాలని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలని సూచించారు.1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ను రాష్ట్ర డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతల స్వీకరణ: ప్రస్తుత డీజీపీ బి.శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీవీ ఆనంద్ మే 1న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సి.వి. ఆనంద్ తన సేవా ప్రయాణాన్ని వరంగల్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ప్రారంభించి అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. అదనపు ఎస్పీగా ఆదిలాబాద్‌లో, ఎస్పీగా నిజామాబాద్‌లో పనిచేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, సీఐడీ డీఐజీగా, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్‌గా సేవలందించిన ఆయన 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు.
2016 నుంచి 2018 వరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సంస్కరణలు అమలు చేశారు. అనంతరం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్‌గా 2018 నుంచి 2021 వరకు పనిచేశారు. 2021 నుంచి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, ఏసీబీ డైరెక్టర్ మరియు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కూడా సేవలందించారు. 2024 నుంచి 2025 వరకు మళ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి, 2025 సెప్టెంబర్ నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-dgp-cv-anand-meets-cm-revanth-reddy-36-218561.html
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.