కమల దళంలో కొత్త చిచ్చు ... పాత కొత్త నేతల మధ్య వార్..

Publish Date:May 17, 2022

Advertisement

కాంగ్రెస్ అంత కాదు గానీ, బీజేపీలోనూ గ్రూపులున్నాయి. నాయకుల మధ్య ఇగో సమస్యలున్నాయి. బీజేపీలో పుట్టి పెరిగిన వారి విషయం ఎలా ఉన్నా, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి, పార్టీ పోకడలు నచ్చడం లేదన్నది, బహిరంగ రహస్యం. ఇప్పటికే ఒక రిద్దరు నాయకులు ముఖ్యంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు వంటి వారు బయటపడి పోయారు.

తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. అలాగే, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం అసంతృప్తితో రగిలి పోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈటల ఆయన అనుచరులు ఆ వార్తలను ఖండిస్తునారు.ఈటల పార్టీలో చేరకముందే అన్ని కోణాల్లో ఆలోచన చేసి, మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాతనే అంతిమ నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. అదీ గాక, ఈటలకు  రాష్ట్ర నాయకత్వంతో స్వల్ప విబేధాలున్నా పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు ఎత్తు పీట వేసి గౌరవిస్తోందని అయన వర్గీయులు చెపుతున్నారు. 
అదలా ఉంటే, ఇతర పార్టీలలో ఎదిగొచ్చిన నాయకులకు, కకమలం పార్టీ కల్చర్’కు అలవాటు పడేవరకు ఉక్కపోత తప్పదని, పార్టీలో చేరి నిలతొక్కుకున్న సీనియర్ నాయకులు అంటున్నారు. ఉక్కపోతను తట్టుకున్నవారే పార్టీలో కొనసాగుతారని లేని వారు, వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లి పోతారని, పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే సీనియర్ నేత ఒకరు, చెప్పు కొచ్చారు.

అందుకే ఇప్పటికే పార్టీలో చేరిన వారిలో కొందరు, అబ్బే లాభం లేదు. కమలంలో కొనసాగడం కష్టమని, గుడ్ బై చెప్పి వెళ్లి పోయారు. ఇలా వెళ్లి పోయిన వారిలో మాజీ మంత్రులు నాగం జనార్ధన రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, పెద్ది రెడ్డి మొదలు నిన్న మొన్న ఇలా వచ్చి  అలా వెళ్ళిపోయిన తీన్మార్ మల్లన్న వరకు చాలా పెద్ద జాబితానే వుంది.అదే విధంగా ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో నిలదొక్కుకున్న నాయకులకు కొదవలేదు. మాజీ మంత్రి డీకే అరుణ మొదలు మాజీ మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు.  

అదలా ఉంటే ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పాద యాత్ర ముగింపు సభలో పార్టీ  సీనియర్ నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బండిపై కురిపించిన ప్రశంసలు, అదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫోన్ చేసి మరీ బండి సంజయ్’ని మెచ్చుకోవడంతో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు, ఉక్కపోత కథలు మరో మారు చర్చకు వచ్చాయి.  
అయితే, ఇతర విధానాల విషయం ఎలా ఉన్నా ఫిరాయింపుల పాలసీ విషయంలో బీజేపీకి క్లారిటీ ఉందని, ఏ పార్టీలోంచి ఎవరు వచ్చినా వద్దనకుండా స్వాగతం పలుకుతుంది.అయితే, పార్టీలో చేరిన తర్వాతనే అసలు కథ మొదలవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి  అంత త్వరగా గర్భగుడి ప్రవేశం లభించదు.

అయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మంత్రులే కాదు, ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో పాత కాపులు, కొత్త నేతల మధ్య విబేధాలను కూడా అదే కోణంలో చూడాలని అంటున్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేశారు,

పార్టీ బండి యాత్రను, ముగింపు సభను సక్సెస్ చేసింది. సో... మోడీ, షా బండి సంజయ్’ను అభినందించారు అంటే అది పార్టీ రాష్ట్ర  శాఖను అభినందించినట్లే నని, అయితే మీడియాలో ఒక వర్గం కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.అలాగని, పార్టీలో అంతా బాగుందా అంటే, లేదు, కమల దళంలోనూ పాలక పక్షాలలో ఉండే, అవలక్షణాలు  అన్నీ ఉన్నాయనే అంటున్నారు.

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.